ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మోదీ పాలనలో దేశం అభివృద్ధి

ABN, Publish Date - Jun 11 , 2025 | 11:24 PM

ప్రధాని మోదీ పాలనలో కనీవిని ఎరగనంత రీతిలో దేశం అభివృద్ధి చెందిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌.వీ.ఎస్‌. ప్రభాకర్‌ అన్నారు.

మాట్లాడుతున్న బీజేపీ రాష్గ్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌వీఎస్‌ ప్రభాకర్‌

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి) : ప్రధాని మోదీ పాలనలో కనీవిని ఎరగనంత రీతిలో దేశం అభివృద్ధి చెందిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌.వీ.ఎస్‌. ప్రభాకర్‌ అన్నారు. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించిందని పేర్కొన్నారు. మోదీ 11ఏళ్ల పాలనపై బుధవారం జిల్లా అఽధక్షుడు శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో ప్రపంచ దేశాలు అతలాకుతలమైదే భారతదేశం మాత్రం సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థను నిలదొక్కుకుందన్నారు. అంతే కాకుండా ప్రపంచ దేశాలకు 280 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌ పంపిణీ చేసిందన్నారు. ఇందిరా గాంధీ పిరియడ్‌లో గరీబ్‌ హాటావో అన్న నినాదం కేవలం నినాదంగానే ఉండి పోయిందన్నారు. మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా దేశంలో 20 కోట్ల కుటుంబాలు అభివృద్ధి దిశలో పయనిస్తున్నాయని వివరించారు. 80 కోట్ల ప్రజలకు ఉచితంగా బియ్యం అందిస్తుందన్నారు. ఆర్టికల్‌ 370 అధికారాన్ని తొలగించడం కోసమన్నారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు త్రిబుల్‌ తలాఖ్‌ను సవరించినట్లు తెలిపారు. డాలర్‌ ఎకానమి నుంచి 4 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుందని, 5 ట్రిలియన్‌ ఎకానమి లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఉమారాణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి, జయశ్రీ, పడాకుల బాల్‌ రాజ్‌, కన్వీనర్‌ పాండురంగారెడ్డి, కిషోర్‌, జిల్లా ప్రధానకార్యదర్శి కిరణ్‌కుమార్‌రెడ్డి, బీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పిట్టల యాదయ్య, కృష్ణవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2025 | 11:24 PM