ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉగ్రదాడి హేయమైన చర్య

ABN, Publish Date - Apr 24 , 2025 | 11:29 PM

ఉగ్ర దాడి హేయమైన చర్య అని బీజేవైఎం నాయకులు పేర్కొన్నారు.

జడ్చర్లలో పాకిస్థాన్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీజేవైఎం నాయకులు

జడ్చర్ల/రాజాపూర్‌/హన్వాడ/మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి) : ఉగ్ర దాడి హేయమైన చర్య అని బీజేవైఎం నాయకులు పేర్కొన్నారు. ఉగ్రదాడికి నిరసనగా బీజేవైఎం ఆధ్వర్యంలో గురువారం అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద పాకిస్థాన్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. అదే విధంగా జడ్చర్లలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మాలిక్‌ షాకీర్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి, ర్యాలీ నిర్వహించారు. ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో కొ వ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. జడ్చర్ల సీనియర్‌ సిటిజన్‌ ఫోరం సభ్యులు పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో నివాళి అర్పిం చారు. రాజాపూర్‌ మండల కేంద్రంలోని బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. హన్వాడ మండలం నాయి నోనిపల్లిలో యువకులు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించి నివాళి అర్పించారు. మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ చౌరస్తాలో తపస్‌ జిల్లా అఽధ్య క్షుడు సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. జిల్లా ప్రధాన కార్యద ర్శి బాబునాయుడు, రాజ్‌మోహన్‌, శ్రీనివాస్‌గౌడ్‌, కర్ణాకర్‌గౌడ్‌, నాగ రాజు, మోహన్‌, సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2025 | 11:29 PM