ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రోజంతా బల్గెరలో ఉద్రిక్తత

ABN, Publish Date - Apr 22 , 2025 | 11:56 PM

మండల పరిధిలోని బల్గెరలో మంగళవారం ఉద్రిక్తత ప రిస్థితులు చోటుచేసుకున్నాయి. గ్రామంలో ది గంబరస్వామి జాతర ఉత్సవాల సందర్భంగా ప్రతీ ఏడాదిలాగే ఈ ఏడాది కూడా పలుపోటీ లు నిర్వహించారు.

పోటీలకు వచ్చిన ఎద్దులను వాహనంలో వెనక్కి పంపిస్తున్న యజమానులు

- నిలిచిన బండలాగుడు పోటీలు

- అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు

గట్టు, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని బల్గెరలో మంగళవారం ఉద్రిక్తత ప రిస్థితులు చోటుచేసుకున్నాయి. గ్రామంలో ది గంబరస్వామి జాతర ఉత్సవాల సందర్భంగా ప్రతీ ఏడాదిలాగే ఈ ఏడాది కూడా పలుపోటీ లు నిర్వహించారు. మంగళవారం ఎద్దుల బం డలాగుడు పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఈ పోటీలకు అనుమతి లేదం టూ పోటీలను పోలీసులు అడ్డుకున్నారు. ఉద యం బల్గెర గ్రామానికి భారీసంఖ్యలో పోలీసు లు చేరుకోవడంతో కొంత టెన్షన్‌ వాతావరణం నెలకొన్నది. గట్టు, కేటీదోడ్డి, మల్దకల్‌ మండలా ల ఎస్‌ఐలు కేటీ.మల్లేశ్‌, నందికర్‌నాయుడు, శ్రీ నివాస్‌ తమ సిబ్బందితో పాటు ప్రత్యేక పోలీసు లు బల్గెరలోని బండలాగుడు ప్రదేశాన్ని చేరుకుని పోటీలు నిర్వహించరాదని గ్రామస్థులకు హెచ్చరిక జారీ చేశారు. అనంతరం పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన ఎద్దులు, వాటి యజమానులను తిరిగి వెళ్లాలని సూచించారు. లేనిపక్షం లో చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించడంతో, వారు చేసేది లేక ఎద్దులను తీసుకుని వెళ్లిపోయారు. ఈవిషయం తెలియడంతో వివి ధ ప్రాంతాల నుంచి పోటీలను తిలకించడానికి వచ్చిన ప్రజలు నిరుత్సాహంగా వెళ్లిపోయారు. అనంతరం పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేసిన బీఆర్‌ఎస్‌ నాయకుడు హన్మంతునాయుడిని బల్గెర సమీపంలోని తన క్రషర్‌ ప్లాంటు దగ్గర గట్టు ఎస్‌ఐ కేటీ మల్లేశ్‌ తన సిబ్బంది హౌజ్‌ అరెస్టు చేశారు. దీంతో అక్కడ పోలీసులతో వాగ్వాదం జరిగింది.

Updated Date - Apr 22 , 2025 | 11:56 PM