‘పది’ అడుగులు ముందుకు..
ABN, Publish Date - May 06 , 2025 | 11:41 PM
పదో తరగతి పరీక్ష-2025లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను కలెక్టర్ బీఎం సంతోష్ అభినందించారు.
- టెన్త్ విద్యార్థులను అభినందించిన కలెక్టర్
- హార్డ్‌వర్క్‌తో పాటు స్మార్ట్‌వర్క్ చేయాలని సూచించిన కలెక్టర్
గద్వాల న్యూటౌన్, మే 6 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్ష-2025లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను కలెక్టర్ బీఎం సంతోష్ అభినందించారు. మంగళవారం ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వ రెసిడెన్సియల్ పాఠశాలల నుంచి పదవ తరగతి పరీక్షల్లో 550 మార్కులకు పైగా సాధించిన 34 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో 32వ స్థానం నుంచి 26వ స్ధానానికి జిల్లా పురోగతి సాధించి 10.36శాతం పెరుగుదలతో ఉత్తమ ఫలితాన్ని సాధించిందని చెప్పారు. విద్యార్థులు జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలంటే క్రమశిక్ష ణ, కష్టపడే తత్వం, తమపై పూర్తి నమ్మకం కలి గి ఉండాలన్నారు. మంచి ఫలితాలు సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని, ఇంటర్‌మీడియట్ దశ విద్యార్ధుల భవిష్యత్‌కు దిశను నిర్ణయించే కీలక దశగా ఉండటంతో, ఈ సమయం లో ప్రతీ విషయాన్ని లోతుగా అర్ధం చేసుకుం టూ, సమయాన్ని ప్రతిదినం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హార్డ్‌వర్క్ మాత్ర మే కాదు... స్మార్ట్‌వర్క్ కూడా ఈ రోజుల్లో చా లా అవసరమని సూచించారు. టెక్నాలజీ మంచి ప్రయోజనాల కోసం ఉపయోగించడం చాలా ముఖ్యమైందన్నారు. మంచి స్నేహితులతో ఉం డాలని, చెడు అలవాట్లు దూరం ఉంచాలని సూచించారు. విద్యతోపాటు శారీరక ఆరోగ్యం కూడా ముఖ్యమని, ప్రతీ రోజు వ్యాయామం చేయాలని సూచించారు. మెరుగైన ఫలితాలు సాధించేందు కు కృషి చేసిన ఉపాధ్యాయులను, విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డీఈవో, హెచ్‌ఎంలు, విద్యార్థులు ఉన్నారు.
Updated Date - May 06 , 2025 | 11:41 PM