క్రీడల హబ్‌గా తెలంగాణ
ABN, Publish Date - Jun 04 , 2025 | 10:57 PM
తెలంగాణను క్రీడల హబ్‌గా తీర్చిదిద్దుతామని ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి చెప్పారు. జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఇండోర్ స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ఒకటవ తెలంగాణ అంతర్ జిల్లాల అండర్ 23 3ఇన్‌టూ3 మహిళలు, పురుషుల బాస్కెట్ బాల్ టోర్నీ నిర్వహిస్తున్నారు.
క్రీడలకు రూ.460 కోట్ల బడ్టెట్
సీఎం రేవంత్‌రెడ్డి ఫుట్‌బాల్ క్రీడాకారుడు
రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణను క్రీడల హబ్‌గా తీర్చిదిద్దుతామని ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి చెప్పారు. జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఇండోర్ స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ఒకటవ తెలంగాణ అంతర్ జిల్లాల అండర్ 23 3ఇన్‌టూ3 మహిళలు, పురుషుల బాస్కెట్ బాల్ టోర్నీ నిర్వహిస్తున్నారు. బుధవారం పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. పదేళ్లుగా బీఆర్‌ఎస్ సర్కార్ క్రీడలను పట్టించుకోలేదన్నారు. గత ప్రభుత్వాలు క్రీడాభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ. 50 కోట్లు ఇస్తే, కాంగ్రెస్ సర్కార్ అధికారం చేపట్టిన గత ఏడాది రూ. 370 కోట్లు, ఈ ఏడాది రూ. 460 కోట్ల కేటాయించినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫుట్‌బాల్ క్రీడాకారుడు కాబట్టి క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేశారు. త్వరలో రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పి వర్ధమాన క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్నారు. జిల్లాలో క్రీడాభివృద్ధికి రూ. 16 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇండోర్ స్టేడియంలో ఏసీ, స్టేడియంలో సింథటిక్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే వాలీబాల్ అకాడమీ మంజూరైందని, సెలక్షన్ నిర్వహించి క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్షుడు రావుల శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉండాలన్నారు. రాష్ట్రంలో బాస్కెట్‌బాల్ క్రీడాభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని, రాష్ట్ర క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి, మహబూబ్‌నగర్-మేడ్చల్ మాల్కజ్‌గిరి జట్ల మధ్య మ్యాచ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో బాస్కెట్‌బాల్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృదీశ్వర్‌రెడ్డి, జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం ప్యాట్రన్ మనోహర్‌రెడ్డి, అధ్యక్ష, కార్యదర్శులు మక్సూద్‌బిన్ అహ్మద్‌జాకీర్, నసూరుల్లా హైదర్ మహ్మద్, బాస్కెట్‌బాల్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సుబహన్‌జీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ మీర్‌ఖలేద్‌అలీ, జాయింట్ సెక్రటరీలు మహ్మద్ ఇలియాజ్, జిల్లా ఒలంపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, బాస్కెట్‌బాల్ సంఘం ప్రతినిధులు విశాల్, హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ శుభారంభం
జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ స్టేడియంలో 1వ తెలంగాణ అంతర్ జిల్లాల అండర్-23 3గీ3 మహిళ, పురుషుల బాస్కెట్‌బాల్ టోర్నీ బుధవారం హోరాహోరీగా మొదలైంది. పురుషుల విభాగంలో మహబూబ్‌నగర్ జట్టు కరీంనగర్‌పై 11-01, ఖమ్మంపై 13-12, మెదక్‌పై 16-10 తేడాతో గెలుపొందింది. మహిళల విభాగంలో మహబూబ్‌నగర్ జట్టు ఖమ్మంపై 11-08, కరీంనగర్‌పై 11-1తో గెలిచింది. పురుషుల విభాగంలో హైదరాబాద్ జట్టు భూపాలపల్లిపై 21-10, రంగారెడ్డి మెదక్‌పై 22-06, హైదరాబాద్ మేడ్చల్‌పై 18-11, హన్మకొండ మహబూబబాద్‌పై 16-14, హైదరాబాద్ నిజామాబాద్‌పై 21-12 తేడాతో గెలుపొందగా, ఖమ్మం జట్టు గద్వాలపై 16-08, మేడ్చల్ నిజామాబాద్‌పై 21-08, నల్గొండ జగిత్యాలపై 18-08, హన్మకొండ కామారెడ్డిపై 17-09 తేడాతో విజయం సాధించాయి. మహిళ విభాగంలో ఖమ్మం జట్టు కరీంనగర్‌పై 15-02, హైదరాబాద్ జయశంకర్ భూపలపల్లిపై 2-00, హైదరాబాద్ జట్టు నిజామాబాద్‌పై 21-08 తేడాతో గెలిచాయి. గురువారం ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.
Updated Date - Jun 04 , 2025 | 10:57 PM