శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ABN, Publish Date - May 26 , 2025 | 11:39 PM
భూ భారతి చట్టం అమలు కోసం ఎంపిక చేసిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి చెప్పారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో లైసెన్స్ సర్వేయర్‌లకు సర్వే సెటిల్‌మెంట్, భూ రికార్డుల శాఖ ద్వారా ఇస్తున్న మొదటి విడత శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు.
కలెక్టర్ విజయేందిర బోయి
లైసెన్స్‌డ్ సర్వేయర్లకు మొదటి విడత ట్రైనింగ్
మహబూబ్‌నగర్ టౌన్, మే 26(ఆంధ్రజ్యోతి): భూ భారతి చట్టం అమలు కోసం ఎంపిక చేసిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి చెప్పారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో లైసెన్స్ సర్వేయర్‌లకు సర్వే సెటిల్‌మెంట్, భూ రికార్డుల శాఖ ద్వారా ఇస్తున్న మొదటి విడత శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ప్రభుత్వం భూ సమస్యలు పరిష్కారం కోసం ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి రోజు భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. ఈ చట్టం అమలులో భాగంగా గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్రంలో 6 వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్‌లను నియమించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా నోటిఫికేషన్ జారీ చేసి, వారిని ఎంపిక చేసినట్లు చెప్పారు. జిల్లాలో మొదటి బ్యాచ్ కింద 132 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్‌లకు సోమవారం నుంచి 50 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వారికి రిటైర్డ్ సర్వేయర్లు థియరీతో పాటు ప్రాక్టికల్‌గా శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణ అనంతరం పరీక్ష ఉంటుందని, అందులో ఉత్తీర్ణులైన వారినే సర్వేయర్లుగా నియమిస్తామన్నారు. లైసెన్స్‌డ్ సర్వేయర్‌లు చేసిన భూ సర్వేను ప్రభుత్వ సర్వేయర్‌లు పరిశీలన చేసి, మ్యాప్ రూపొందిస్తారని అన్నారు. అభ్యర్థులకు కలెక్టర్ శిక్షణ మెటీరియల్ కిట్‌ను అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్ రావు, కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 26 , 2025 | 11:39 PM