ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆస్తి పన్ను వసూలుకు ఆదరణ

ABN, Publish Date - May 07 , 2025 | 11:40 PM

రాష్ట్ర ప్రభుత్వం పట్టణ పరిధిలోని ఆస్తు లపై ముందస్తు పన్ను చెల్లించే వారి కోసం ప్రకటించిన రాయితీకి మంచి ఆ దరణ లభించింది.

గద్వాల పట్టణం

- గద్వాల జిల్లాలోని 4 పట్టణాల్లో రూ.2.30 కోట్లు వసూలు

- ముందస్తుగా చెల్లించడంతో రూ.11లక్షలకు పైగా ఆదా

గద్వాలటౌన్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పట్టణ పరిధిలోని ఆస్తు లపై ముందస్తు పన్ను చెల్లించే వారి కోసం ప్రకటించిన రాయితీకి మంచి ఆ దరణ లభించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పట్టణ ప్రాం తాల్లో అడ్వాన్స్‌గా పన్నుచెల్లించిన వారికి పన్నులో ఐదుశాతం రాయితీ ప్రకటిం చింది. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రం గద్వాలతో పాటు అలంపూర్‌, అయిజ, వడ్డేపల్లి మునిసిపల్‌ పట్టణాల్లో మొత్తం 26వేలకు పైగా ఆస్తులు ఉండగా వాటి లో 6,496 ఆస్తులకు సంబంధించి ముందస్తు పన్ను రూ.2.30 కోట్లు వసూలైం ది. దీంతో పన్ను చెల్లించిన వారికి రూ.11.56లక్షల మేరకు ఆదా అయ్యిందని అధి కారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పన్ను వసూళుకు సంబంధించి గద్వాల లో 2,952 ఆస్తులపై రూ.1.51కోట్లు, అయిజలోని 1,924 ఆస్తులపై రూ.37.20 లక్షలు, అలంపూర్‌లో 562 ఆస్తులపై రూ.12.18లక్షలు, వడ్డేపల్లిలో 1,056 ఆస్తులపై రూ.31.08లక్షలు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం పొడగించిన రాయితీ గడువు బుధవారంతో ముగిసిందని అధికారులు తెలిపారు.

Updated Date - May 07 , 2025 | 11:40 PM