సృజనాత్మకతను వెలికి తీసేందుకే సమ్మర్ క్యాంపులు
ABN, Publish Date - May 18 , 2025 | 11:00 PM
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు సమ్మర్ క్యాంపులు ఎంతగానో ఉపయోగపడతాయని ఎంఈవో బాలాజీ అన్నారు.
- ఎంఈవో బాలాజీ
- పాఠశాలల్లో ముగిసిన వేసవి శిక్షణా శిబిరాలు
నారాయణపేట రూరల్/ధన్వాడ/దామరగిద్ద /మక్తల్, మే 18 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు సమ్మర్ క్యాంపులు ఎంతగానో ఉపయోగపడతాయని ఎంఈవో బాలాజీ అన్నారు. ఆదివారం పేట మండలం జాజాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో సమర్ క్యాంపు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. వేసవి సెలవులు వృథా చేయకుండా చదువుతో పాటు కళలు నేర్చుకునేందుకు ఈ క్యాంపులో శిక్షణ నివ్వడం జరిగిందన్నారు. హెచ్‌ఎం భారతి, ఉపాధ్యాయులు విజయ, భానుప్రకాశ్, లక్ష్మణ్, రఘురాంరెడ్డి, వెంకటేశ్ తదితరులున్నారు.
అదేవిధంగా, ధన్వాడ బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం యంగ్ ఇండియా సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థినులకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ప్రధానోపాధ్యాయుడు కెంచె నరేందర్ బహుమతులు అందించారు. క్యాంపులో శిక్షకులుగా వ్యవహరించిన నారాయణ, పీఈటీ అనంతసేనలను శాలువాతో సన్మానించారు.
దామరగిద్ద మండలం మొగల్‌మడ్క జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యువ భారత్ వేసవి శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది. శిబి రంలో విద్యార్థులకు యోగా, ధ్యానం, సూర్య నమస్కారాలు, డ్రాయింగ్, స్పోకెన్ ఇంగ్లిష్, గణితం, సైన్స్ తదితర విషయాల్లో అవగాహన కల్పించారు. ఎన్‌ఆర్‌ఐ కాశప్ప మోటివేషన్ క్లాసు ఇచ్చారు. కార్యక్రమంలో ఎంఈవో కృష్ణారెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్‌పర్సన్ అనురాధ, మాజీ సర్పంచు మహిపాల్, ఉపాధ్యాయులు నవ్యశ్రీ, శశిధర్, ప్రకాష్, మోహన్‌రెడ్డి, మల్లికార్జున్, ప్రకాష్, వెంకటేష్‌నాయక్ తదితరులున్నారు.
మక్తల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో యంగ్ ఇండియా శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఎంఈవో అని ల్‌గౌడ్, జీహెచ్‌ఎం నాగేశ్వరయ్య హాజరై, మాట్లా డారు. విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు యంగ్ ఇండియా శిక్షణ శిబిరాలు ని ర్వహిస్తున్నామన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందిస్తామన్నారు. అనంతరం విద్యార్థులు తమ అనుభవాలను వి వరించారు. ఉపాధ్యాయులు ప్రసన్నకుమారి, ప రంజ్యోతి, సుధీర్, భారతి, భాగ్యలక్ష్మీ ఉన్నారు.
Updated Date - May 18 , 2025 | 11:00 PM