ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచాలి

ABN, Publish Date - May 29 , 2025 | 11:10 PM

ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు విత్తనాలతో పాటు ఎరువులను అం దుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ ఏడీఏ సంగీతలక్ష్మి సూచించారు.

- వ్యవసాయ శాఖ ఏడీఏ సంగీతలక్ష్మి

- మాచర్లలో ఫర్టిలైజర్‌ షాపుల తనిఖీ

గట్టు, మే 29 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు విత్తనాలతో పాటు ఎరువులను అం దుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ ఏడీఏ సంగీతలక్ష్మి సూచించారు. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా మండల పరిధిలోని మాచర్ల, గట్టు గ్రామాల్లోని ఫర్టిలైజర్‌ షాపులతో పాటు విత్తనాల షాపులను ఆమె తనిఖీ చేశారు. ప్రధానంగా వర్షాకాలం ఆరం భం అవుతున్నందున రైతులకు విత్తనాలతో పాటు, ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం దుకాణాల్లో స్టాక్‌ రిజిస్టర్లను తనిఖీ చేశారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు రశీదు తప్పకుండా ఇవ్వాలని సూచించారు. ఇచ్చిన రశీదులను రైతులు జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి సమస్య వచ్చి నా వెంటనే వ్యవసాయశాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఆమెవెంట వ్యవసాయశాఖ అధికారి హన్మంతురెడ్డి, ఏఈవో తోహిద్‌ పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2025 | 11:10 PM