పోలీస్ జాగిలంతో ఆకస్మిక తనిఖీలు
ABN, Publish Date - May 02 , 2025 | 11:07 PM
పోలీస్ జాగిలంతో శుక్రవారం నారా యణపేటలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు.
నారాయణపేట, మే 2 (ఆంధ్రజ్యోతి): పోలీస్ జాగిలంతో శుక్రవారం నారా యణపేటలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలన, అక్రమ రవాణా జరుగకుండా నారాయణపేలో పకడ్బందీగా తనిఖీలు ని ర్వహించామన్నారు. ముఖ్యంగా కిరాణా షాపులు, అనుమానమున్న ప్రదేశాలు, కొరియర్ దుకాణాలు, పాన్‌షాపుల్లో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు వినియోగిస్తున్నా, రవాణా చేస్తున్నా వెంటనే డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో కానిస్టేబుల్ సంతోష్, నార్కోటిక్స్ స్నైపర్ డాగ్ విక్కీ, డాగ్ హ్యండ్లర్ పరమేష్ ఉన్నారు.
Updated Date - May 02 , 2025 | 11:07 PM