ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని చదవాలి

ABN, Publish Date - Jul 25 , 2025 | 11:27 PM

వి ద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని చదువుకున్నప్పు డే మంచి భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్‌ ఆద ర్శ్‌ సురభి అన్నారు.

మదనాపురం, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : వి ద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని చదువుకున్నప్పు డే మంచి భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్‌ ఆద ర్శ్‌ సురభి అన్నారు. శుక్రవారం మండలంలోని కొన్నూరు గ్రామంలో దాతల సాయంతో ఎస్పీ రావుల గిరిధర్‌తో కలిసి విద్యార్థులకు టై, బూ ట్లు అందజేసి మాట్లాడారు. దాతల సహకారం తో పాఠశాల నిర్మించారని, విద్యార్థులు కూడా బాగా చదువుకొని మంచి ఫలితాలు తెచ్చుకొని గొప్ప పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థులు బట్టిపట్టే విధానానికి స్వస్తి చేప్పి మెలకువలు నేర్చుకొని పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చన్నారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్‌ వారికి గణితంలో పలు ప్రశ్నలు సందించి స మాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు.

Updated Date - Jul 25 , 2025 | 11:27 PM