ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లక్కీడిప్‌ ద్వారా విద్యార్థుల ఎంపిక

ABN, Publish Date - Jun 20 , 2025 | 11:29 PM

బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లో ఎస్సీ విద్యార్థులు ఉచితంగా చదివేందుకు నిబంధనల ప్రకారం లక్కీ డిప్‌ ద్వారా ఎంపిక చేసినట్లు జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ నర్సింగరావు తెలిపారు.

- జోగుళాంబ గద్వాల అదనపు కలెక్టర్‌ నర్సింగరావు

గద్వాల న్యూటౌన్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లో ఎస్సీ విద్యార్థులు ఉచితంగా చదివేందుకు నిబంధనల ప్రకారం లక్కీ డిప్‌ ద్వారా ఎంపిక చేసినట్లు జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ నర్సింగరావు తెలిపారు. శుక్రవారం ఐడీవోసీ సమావేశపు మందిరంలో జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను వారి తల్లిదండ్రుల సమక్షంలో అదనపు కలెక్టర్‌ నర్సింగరావు లక్కీడిప్‌ ద్వారా ఎంపిక చేశారు. జిల్లాలో నిర్దేశించిన ప్రైవేట్‌ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఒకటవ తరగతిలో చేరేందుకు 57సీట్లు(నాన్‌ రెసిడెన్సియల్‌), ఐదో తరగతిలో చేరేందుకు 59సీట్లు (రెసిడెన్సియల్‌) కేటాయించగా మొత్తం 760మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారన్నారు. గ్రూప్‌ వారిగా వీరిలో 33శాతం రిజర్వేషన్లు బాలికలకు కేటాయించగా, మిగిలిన సీట్లను జనరల్‌ కోటాలో లక్కీడిప్‌ తీసినట్లు తెలిపారు. ఆయా తరగతిలో రిజర్వేషన్లు ఉన్న బాలికలు, జనరల్‌ కోటాలో ఐదుమంది చొప్పున అదనంగా వెయిటింట్‌ లిస్టులో ఉంచేందుకు విద్యార్థులను ఎంపిక చేశామన్నారు. ఎంపికైన విద్యార్థులు తమ ధ్రువపత్రాలను తీసుకొని ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్పీ కార్పొరేషన్‌ ఈడీ రమేశ్‌బాబు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు.

Updated Date - Jun 20 , 2025 | 11:29 PM