జిల్లాలో బలమైన ఈదురుగాలులు
ABN, Publish Date - Apr 10 , 2025 | 11:28 PM
జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం నుంచి బలమైన ఈదురు గాలులు వీశాయి.
పేట శ్యాసన్‌పల్లి మార్గంలో నేలకొరిగిన భారీ వృక్షం
- నేలకొరిగిన చెట్లు
- విద్యుత్ అంతరాయంతో ప్రజలకు తప్పని పాట్లు
నారాయణపేట, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం నుంచి బలమైన ఈదురు గాలులు వీశాయి. దాంతో పలు చెట్లు నేలకొరిగాయి. ఇంకొన్ని చోట్ల రేకుల షెడ్లు గాలికి లేచి పడిపోయాయి. మామిడి కాయలు నేలకొరగడంతో నష్టం జరిగిందని రైతులు వాపోయారు. ఈదురుగాలుల బీభత్సంతో పట్టణంలో విద్యుత్ అంతరాయం ఏర్పడి ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు.
Updated Date - Apr 10 , 2025 | 11:28 PM