ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కఠిన చర్యలు తీసుకోవాలి

ABN, Publish Date - May 23 , 2025 | 11:13 PM

నకిలీ పత్తి విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలె క్టర్‌ విజయేందిర బోయి టాస్క్‌పోర్స్‌ అధికారులను ఆదేశించా రు.

సమావేశ ంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయేందిర బోయి

- నకిలీ పత్తి విత్తనాల అమ్మకాలపై అధికారులతో కలెక్టర్‌ సమీక్ష

మహబూబ్‌ నగర్‌ కలెక్టరేట్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): నకిలీ పత్తి విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలె క్టర్‌ విజయేందిర బోయి టాస్క్‌పోర్స్‌ అధికారులను ఆదేశించా రు. ప్రభుత్వ అనుమతి లేని బిజి-3 నకిలీ పత్తి విత్తనాల నియంత్రణకు పోలీస్‌, వ్యవసాయ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్‌పోర్స్‌ టీంలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలోని మినీ సమావేశ మంది రంలో శుక్రవారం నిర్వహించిన నకిలీ పత్తి విత్తనాల నియం త్రణపై అధికారులు, పోలీస్‌ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్‌ పోర్స్‌ టీమ్‌ల సమన్వయ సమావేశంలో ఆమె ఎస్పీ డి. జానకితో కలిసి మాట్లాడారు. జూన్‌ నెల కంటే ముందుగానే వర్షాలు పడుతున్నందున వ్యవసాయ పనులు ప్రారంభం అ య్యాయన్నారు. జిల్లాలో వరి తర్వాత ఎక్కువగా పత్తి సాగు చేస్తున్నట్లు తెలిపారు. సుమారు 75 వేల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేస్తారని, వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసినట్లు చెప్పారు. ప్రభుత్వ అనుమతిలేని బిజి-3 నకిలీ పత్తి విత్తనాల వంటివి అమ్మడం, విత్తడం, ఎమ్మార్పీ కంటే అదిక ధ రలకు అమ్మడం చట్టరీత్యా నేరం అన్నారు. అటు వంటి వారిపై 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, పీడీ యాక్ట్‌ నమోదుతో పాటు క్రిమినల్‌ కేసులు నమా దు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బిజి-3 నకిలీ పత్తి విత్తనాలు విత్తడం వల్ల భూసా రం దెబ్బతినడమే కాకుండా వాతావరణం కలుషితం అవు తుందని తెలిపారు. నకిలీ పత్తి విత్తనాల వల్ల వచ్చే పత్తితో తయారు చేసిన దుస్తువులు దరిస్తే చర్మ క్యాన్సర్‌ వస్తుందని తెలిపారు. శనివారం నుంచి ఈ నెల 28 వరకు 16 టాస్క్‌ పోర్స్‌ టీంలు జిల్లాలోని 259 డీలర్‌ ఓట్‌లెట్‌లను తనఖీ చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో తేదీ దాటిన విత్తనాలు అమ్మినా, నిల్వ ఉంచినా, అనుమతి లేని నకిలీ విత్తనాలు అమ్మినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే 1,19,000 కిలోల పత్తి విత్తనాలను సరాఫరా చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అనుమతి గల బిజి-2 పత్తి విత్తనాలను మాత్రమే లైసెన్సుడు ఓట్‌ లెట్‌ డీలర్ల నుంచి కొనుగోలు చేయాలని సూచించారు. చెక్‌పోస్టులలో కూడా గట్టి నిఘా ఉంచాలని సూచించారు. ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ గత సంవత్సరం జడ్చర్ల మండలం గోప్లాపూర్‌లో 151 కిలోలు, మరో 51 కిలోలు నకిలీ పత్తి విత్తనాలను పట్టుకొని రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ శుక్రవారం కూడా గోప్లాపూర్‌లోనే లక్షా 50 వేల విలువ కలిగిన 30 కిలోలు నకిలీ పత్తివిత్తనాలు పట్టుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ మోహన్‌ రావు, అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డి.సి.ఆర్‌.బి డీఎస్పీ రమణారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్‌, సీఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2025 | 11:13 PM