ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

ABN, Publish Date - Jun 23 , 2025 | 11:13 PM

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ హెచ్చరించారు.

విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌

- నాగర్‌కర్నూల్‌ ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌

- ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్‌కు తరలింపు

నాగర్‌కర్నూల్‌ క్రైం, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి) : నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిమ్మాజిపేట మండలం లోని ఆవంచ గ్రామంలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందిందని తెలిపారు. దీంతో గత నెల 30వ తేదీన వ్యవసాయ అధికారి కమల్‌కుమార్‌ స్థానిక పోలీసుల సహకారంతో గ్రామానికి వెళ్లి రైతు కనిక వెంకటయ్య ఇంట్లో సోదాలు నిర్వహించగా, 10 కిలోల విత్తనాలు లభిం చాయి. అతడి వద్ద రశీదులు లేకపోవడంతో విత్తనాలను స్వాధీనం చేసుకు న్నారు. అతడిని విచారించగా గ్రామానికి చెందిన వస్పరి వెంకటయ్య తనకు విక్రయించినట్లు చెప్పాడు. దీంతో అతడిని కూడా అదుపులోకి తీసుకొని విచారిం చగా, జడ్చర్లకు చెందిన నారాయణగౌడ్‌ పేరు చెప్పాడు. అతడిని విచారించగా గుజరాత్‌కు చెందిన సత్యమూర్తికుమార్‌ కొరియర్‌ ద్వారా తనకు పంపించినట్లు తెలిపారు. దీంతో వారిద్దరినీ అరెస్ట్‌ చేసి, సోమవారం కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ వివరించారు. దళారుల మాటలు నమ్మి నకిలీ విత్తనాలను కొనవద్దని రైతులకు సూచించారు. విత్తనాలు ప్రభుత్వం అనుమతి పొందినవి కొనుగోలు చేసి వాటి పత్రాలను భద్రంగా పర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్‌యాదవ్‌, సీఐ కనకయ్య, తిమ్మాజిపేట ఎస్‌ఐ, పోలీస్‌ సిబ్బంది తైతన్‌ ఉన్నారు.

Updated Date - Jun 23 , 2025 | 11:13 PM