ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బెట్టింగ్‌లకు దూరంగా ఉండండి

ABN, Publish Date - Apr 01 , 2025 | 11:04 PM

యువత క్రికెట్‌ బెట్టింగ్‌, ఆన్‌లైన్‌ గేమింగ్‌లకు దూరంగా ఉండాలని మహబూబ్‌నగర్‌ ఎస్పీ జానకి మంగళవారం ఒక ప్రకటనలో ప్రజలకు పిలుపునిచ్చారు.

మహబూబ్‌నగర్‌ ఎస్పీ జానకి

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): యువత క్రికెట్‌ బెట్టింగ్‌, ఆన్‌లైన్‌ గేమింగ్‌లకు దూరంగా ఉండాలని మహబూబ్‌నగర్‌ ఎస్పీ జానకి మంగళవారం ఒక ప్రకటనలో ప్రజలకు పిలుపునిచ్చారు. యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్‌ యాప్స్‌, నిషేధిత గేమింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, ఐపీఎల్‌ బెట్టింగ్‌లకు పాల్పడొద్దన్నారు. తక్కువ సమయంలో అధికంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో బెట్టింగ్‌, ఆన్‌లైన్‌ గేమింగ్‌కు యువత బానిసలు అవుతున్నారని చెప్పారు. అప్పులు చేసి, ఆర్థికంగా నష్టపోవడంతో మానసిక ఒత్తిడికి గురై తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉందన్నారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, ప్లేకార్డ్స్‌, ఇతర గేమింగ్‌ యాప్స్‌పై తెలంగాణ పోలీ్‌సశాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసిందని, ఆధునిక సాంకేతికత సాయంతో ఇలాంటి అక్రమ కార్యక్రమాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలు, ప్రవర్తనపై శ్రద్ధ పెట్టాలన్నారు. ఆన్‌లైన్‌ కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని కోరారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండి, బెట్టింగ్‌లపై పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Apr 01 , 2025 | 11:04 PM