ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పకడ్బందీగా రాష్ట్ర అవతరణ వేడుకలు

ABN, Publish Date - May 31 , 2025 | 11:09 PM

రాష్ట్ర అవతరణ వేడుకలకు పకడ్బందీగా ఏర్పా ట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు.

మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ

- అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ

గద్వాల న్యూటౌన్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అవతరణ వేడుకలకు పకడ్బందీగా ఏర్పా ట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని తన చాంబర్‌లో శనివారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవన ఆవరణలో ఉదయం 10 గంటలకు నిర్వహించే కార్యక్రమాలపై ఆయా శాఖల అధికారులకు దిశానిర్ధేశం చేశారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా శాఖల ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. జి ల్లా కేంద్రంలోని స్మృతివనం, పాతబస్టాండ్‌ వద్ద గల తెలంగాణ పోరాట యోధుల విగ్రహాల వ ద్ద, సభాస్థలి వేధికలను పూలతో అలంకరించాలని ఆదేశించారు. పోలీస్‌ గౌరవ వందనంతో పాటు వేడుకలలో బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్‌ అధికారులకు సూచించారు. బాలభవన్‌, పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని డీఈవోకు సూ చించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నర్సింగారావు, ఆర్డీవో శ్రీనివాసరావు, ఏవో భూపాల్‌రెడ్డి, డీఎస్పీ మొగులయ్య, తహసీల్దార్‌ మల్లికార్జున్‌, మునిసిపల్‌ కమిషనర్‌ దశరథ్‌, అఽధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2025 | 11:09 PM