ప్రభుత్వానికి అండగా ఉండండి
ABN, Publish Date - May 22 , 2025 | 10:54 PM
అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, లబ్ధిదారులంతా ప్రభుత్వానికి అండగా ఉండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన అమలులోకి వచ్చిన తరువాత ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు.
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి
79 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
మహబూబ్‌నగర్, మే 22 (ఆంధ్రజ్యోతి): అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, లబ్ధిదారులంతా ప్రభుత్వానికి అండగా ఉండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన అమలులోకి వచ్చిన తరువాత ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. గురువారం నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 79 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలనలో అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రైతు భరోసా, ధాన్యానికి రూ.500 బోనస్, రుణమాఫీ అమలు చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతీ పేదవాడికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇస్తామన్నారు. రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇదివరకు రేషన్ బియ్యం డీలర్ల వద్దనే చేతులు మారేదని, ఇప్పుడు ప్రతీ లబ్ధిదారు బియ్యం తీసుకుని తింటున్నాడని చెప్పారు. నిరుద్యోగులకు ఇప్పటికే పెద్దఎత్తున నోటిఫికేషన్‌లు ఇచ్చి, ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్‌లు వస్తాయన్నారు. అందరికీ నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, నాయకులు వినోద్‌కుమార్, సీజే బెనహర్, షబ్బీర్‌అహ్మద్, రాములుయాదవ్, అవేజ్, అజ్మత్‌అలీ, అబ్దుల్‌హక్, సంజీవ్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, ప్రశాంత్, తిరుమల వెంకటేశ్ పాల్గొన్నారు.
Updated Date - May 22 , 2025 | 10:54 PM