ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తడబడి

ABN, Publish Date - May 26 , 2025 | 11:37 PM

ఒకప్పటితో పోల్చితే చెట్ల కింద చదువులు లేవు.. ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా లేదు.. విద్యుత్‌ సౌకర్యం మొదలుకొని విద్యార్థులకు డ్యూయల్‌ డెస్క్‌ల వరకు అన్నీ సమకూరాయి. బోధనా వసతులు ఏటికేడు మెరుగవుతున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య విషయంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారి మరుగున పడిపోతున్నాయి. అదే సమయంలో ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి వాటిల్లో విద్యార్థుల సంఖ్య ప్రతీఏటా పెరుగుతూనే ఉంది.

వనపర్తి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డ్యూయల్‌ డెస్క్‌లు

ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు పెరిగినా తగ్గుతున్న విద్యార్థులు

విద్యాబోధన, మౌలిక వసతుల విషయంలో తల్లిదండ్రులు నారాజ్‌

స్పెషల్‌ యాక్టివిటీస్‌ ప్రభుత్వ పాఠశాలల్లో నిల్‌.. ప్రైవేటులో ఫుల్‌

గవర్నమెంట్‌ బడి పిల్లలు ప్రైవేటుతో పోటీ పడలేరనే భావన ఎక్కువ

అన్నీ ఉన్నా తగిన ఫలితాలను సాధించని టీచర్లు

ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మేలంటున్న తల్లిదండ్రులు

ఒకప్పుడు ప్రభుత్వ బడి అంటే బందెలదొడ్డి మాదిరి ఉంటేది.... ప్రభుత్వాలు మారినయ్‌.. అభివృద్ధి జరుగుతోంది.. దేశ భవిష్యత్‌ను నిర్దేశించే విద్యపై శ్రద్ధ పెరిగింది.. అదే ప్రభుత్వ బడిలో నిరుపేదలైనా విద్యాప్రమాణాలకు అనుగుణంగా విద్యనభ్యసించే పరిస్థితి వచ్చింది.... కనీస వసతులు అందుబాటులోకి వచ్చాయి.... ఉన్నత విద్యావంతులైన ఉపాధ్యాయులు ఉన్నారు.. ప్రభుత్వ పర్యవేక్షణ పెరిగింది. అన్నీ ఉన్నా ఎక్కడో తేడా కొడుతోంది... ఏటికేడు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ప్రైవేటు పాఠశాలల్లో చదివించడం విద్యార్థుల తల్లిదండ్రులకు తలకుమించిన భారం అవుతోంది... ఇంత తడబాటు ఉన్నా అక్కడక్కడ మంచి ఫలితాలు రావడం అభిలషణీయం.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ’ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన సర్వేలో ఇలాంటి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

మహబూబ్‌నగర్‌, మే 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఒకప్పటితో పోల్చితే చెట్ల కింద చదువులు లేవు.. ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా లేదు.. విద్యుత్‌ సౌకర్యం మొదలుకొని విద్యార్థులకు డ్యూయల్‌ డెస్క్‌ల వరకు అన్నీ సమకూరాయి. బోధనా వసతులు ఏటికేడు మెరుగవుతున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య విషయంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారి మరుగున పడిపోతున్నాయి. అదే సమయంలో ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి వాటిల్లో విద్యార్థుల సంఖ్య ప్రతీఏటా పెరుగుతూనే ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు యూనిఫాంలు, టై, బెల్టులు, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం కూడా ప్రస్తుతం అందుతున్నాయి. ఎక్కడా కొరత కూడా పెద్దగా కనిపించడం లేదు. అయినా తల్లిదండ్రుల్లో ఇంకా ప్రభుత్వ పాఠశాలల పట్ల నమ్మకం రోజురోజుకూ తగ్గుతోంది. ఊర్లలోనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలను కాదని, అధిక ఫీజులు చెల్లించి మరీ తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను చదివిస్తున్నారు. ప్రతీఏటా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ. అది కూడా మొక్కుబడి కార్యక్రమంలా జరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతులు, విద్యాబోధన, బడిబాట ఫలితాలపై సోమవారం ఆంధ్రజ్యోతి నిర్వహించిన సర్వేలో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యావంతులతో శాంపిళ్లు సేకరించింది. ఈ సర్వేలో ప్రభుత్వ పాఠశాలల పట్ల వారి వైఖరి తేటతెల్లమవుతోంది.

ప్రత్యేక యాక్టివిటీస్‌ కరువు...

ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించాలంటే కేవలం పాఠ్యపుస్తకాల్లో ఉన్న అంశాలే కాకుండా ఇతర యాక్టివిటీస్‌ కూడా అవసరం అవుతున్నాయి. అవి ప్రైవేటు పాఠశాలల్లో ఫుల్‌గా ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో నిల్‌ అని చెప్పవచ్చు. ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న పాఠశాలల్లో మినహాయిస్తే మెజారిటీ ప్రభుత్వ పాఠశాలల్లో ఆ తరహా యాక్టివిటీస్‌ ఉండటం లేదు. వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులే నైపుణ్యం కలిగి ఉంటారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉద్యోగం సాధించని వారు ప్రైవేటులో విద్యాబోధనకు వెళుతున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన జరగాలి. కానీ నేటికీ ప్రైవేటులోనే విద్యాబోధన బాగుంటుందని ఆంధ్రజ్యోతి సర్వేలో విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్న పరిస్థితి. మౌలిక వసతుల విషయంలో కూడా ప్రభుత్వ పాఠశాలలు గతంలో కంటే మెరుగయ్యాయి. ఇంకా కొన్నిచోట్ల మరుగుదొడ్లు, విద్యుత్‌ సౌకర్యం లేని పాఠశాలలు ఉన్నప్పటికీ మెజారిటీ పాఠశాలల్లో మన ఊరు- మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించారు. కానీ ఇప్పటికీ సౌకర్యాలు సరిగా లేవనే భావనే విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావంతుల్లో ఉన్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు అక్కడ చదివితే విద్యా లక్ష్యాలు చేరుకులేమనే భావన ఉన్నట్లు తెలుస్తోంది. విద్యా సామర్థ్యాలను పెంపొందించడంలో కూడా తేడాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

పెరుగుతున్న సౌకర్యాలు- తగ్గుతున్న సంఖ్య...

ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు పెరుగుతున్నా కొద్దీ విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఉదాహరణకు నారాయణపేట జిల్లాలో 2023-2024 విద్యా సంవత్సరంలో 494 ప్రభుత్వ పాఠశాలల్లో 70,045 మంది విద్యార్థులు చదివితే తర్వాతి సంవత్సరం వచ్చే సరికి పాఠశాలల సంఖ్య 533కి పెరిగినప్పటికీ 66,387కు విద్యార్థుల సంఖ్య తగ్గింది. అంటే దాదాపు 3,658 మంది విద్యార్థులు తగ్గారు. అదే ప్రైవేటులో 134 పాఠశాలలకు 2023-24 విద్యా సంవత్సరంలో 34,695 మంది విద్యార్థులు ఉండగా ఆ తర్వాత సంవత్సరానికి 8 పాఠశాలలు పెరిగి 37,968 మంది విద్యార్థులు చదివారు. 3273 మంది విద్యార్థులు ప్రైవేటులో పెరిగారు. వనపర్తి జిల్లాలో 2023-2024 విద్యా సంవత్సరంలో 518 పాఠశాలల్లో 36,282 మంది విద్యార్థులు చదివారు. ఆ తర్వాత సంవత్సరం 517 పాఠశాలల్లో 33,747 మంది చదివారు. ఒక్క సంవత్సరంలో 2,535 మంది విద్యార్థులు తగ్గారు. నాగర్‌కర్నూలు జిల్లాలో 852 ప్రభుత్వ పాఠశాలు ఉండగా 2023-24 విద్యా సంవత్సరంలో 1,31,885 మంది విద్యార్థులు చదివారు. తర్వాతి సంవత్సరంలో ఆ సంఖ్య 1,28,973కు పడిపోయింది. ఒక్క సంవత్సరంలో 2912 మంది విద్యార్థులు తగ్గారు. మహబూబ్‌నగర్‌, గద్వాల జిల్లాల్లో మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పెరుగుతున్నారు. 2023-24 విద్యాసంవత్సరంలో 488 పాఠశాలల్లో 1,10,762 మంది విద్యార్థులు ఉండగా ఆ తర్వాత సంవత్సరం 1,17,754 మంది విద్యార్థులు ఉన్నారు. దాదాపు 6,994 మంది విద్యార్థులు పెరిగారు. అదే సమయంలో ప్రైవేటు పాఠశాల్లోనూ విద్యార్థులు దాదాపు 9,166 మంది పెరిగారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2023-24లో 61,395 మంది విద్యార్థులు ఉండగా. తర్వాత సంవత్సరంలో 63532 మంది విద్యార్థులు చదివారు. దాదాపు 2137 మంది విద్యార్థులు పెరిగారు.

ప్రమాణాల మెరుగుకు టీచర్లు కృషి చేయాలి

ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యాప్రమాణాల అభివృద్ధికి కృషి చేయకపోవడంతోనే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలవైపు వెళుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతీ ఉపాధ్యాయుడు తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తే ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటుకు ఏమాత్రం తక్కువ కాదు. కొందరు ఉపాధ్యాయులు కేవలం వస్తారు.. వెళ్తారు.. తప్పా విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టరు. అందుకే అధిక ఫీజులైనా తల్లిదండ్రులు ప్రైవేటుకు వెళుతున్నారు.

- నర్సింహులు, రైల్వే ఉద్యోగి, గద్వాల

మౌలిక వసతులు పెంచాలి

ప్రభుత్వ పాఠశాలలు గతంలో కంటే మెరుగయ్యాయి. మౌలిక వసతుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, ముఖ్యంగా ఉపాధ్యాయుల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివేలా జీవో తీసుకురావాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయి. గ్రామాల్లో విద్యా కమిటీలను బలోపేతం చేసి బడిబాటను పకడ్బందీగా నిర్వహించాలి.

- విజయభాస్కర్‌రెడ్డి, ఎంఏ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, మక్తల్‌

నిత్యం విద్యార్థుల అవస్థలు

వనపర్తి పట్టణంలోని ఇందిరానగర్‌ ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లకు తలుపులు లేవు., వంటగది సక్రమంగా లేదు. విద్యార్థులు చేతులు కడుక్కోవడానికి నల్లాలు సైతం అమర్చకపోవడంతో నిత్యం అవస్థలు పడుతున్నారు. కూర్చోవడానికి బెంచీలు లేవు. ఉన్నతాధికారులు దృష్టి సారించి పాఠశాల ప్రారంభం నాటికి సమస్యలు పరిష్కరించాలి.

- బాలమణి, పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌, ఎంపీపీఎస్‌ ఇందిరానగర్‌

Updated Date - May 26 , 2025 | 11:37 PM