శ్రీసాయి నర్సింగ్ హోమ్ ఆసుపత్రి సీజ్
ABN, Publish Date - Apr 19 , 2025 | 11:25 PM
ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. అందులో భాగ ంగానే ఆత్మకూరు పట్టణ కేంద్రంలోని శ్రీ సా యి నర్సింగ్ హోమ్‌లో అర్హత కలిగిన వైద్యు లు
రిజిస్ట్రేషన్ రద్దు
- అనస్థీషియా వైద్యులు లేకుండానే ఫోర్జరీ సంతకాలతో మత్తు మందు ఇచ్చిన వైనం
- పూర్తి వివరాలు సేకరించి శ్రీసాయి నర్సింగ్ హోమ్ వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదు
- వివరాలు వెల్లడించిన జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు
ఆత్మకూరు, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. అందులో భాగ ంగానే ఆత్మకూరు పట్టణ కేంద్రంలోని శ్రీ సా యి నర్సింగ్ హోమ్‌లో అర్హత కలిగిన వైద్యు లు లేకుండానే వైద్యం చేస్తూ పేదల ప్రాణా లతో చెలగాటమాడే దుస్థితి నెలకొంది. అనస్థీ షియా వైద్యులు(మత్తుమందు ఇచ్చే వైద్యు లు) లేకుండానే పేషెంట్‌కు మత్తు మందు ఇచ్చి సిజేరియన్ చేసిన సంఘటన ఆలస్యం గా వెలుగు చూసింది. శ్రీసాయి నర్సింగ్ హోమ్‌లో ఈ నెల 8వ తేదీన సిజేరియన్ కోసం వచ్చిన ఓ గర్భిణీకి తల, మొండెం వేరు చేసి మృత శిశువును బ యటకు తీసిన దుస్థితి పాఠకులకు తెలిసిం దే. ఈ సందర్భంగా సీసీ ఫుటేజ్‌లో పరిశీలిం చిన అనంతరం శనివారం జిల్లా వైద్యాధికారి శ్రీసాయి నర్సింగ్‌ను సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన వివ రాలు వెల్లడించారు. 8వ తేదీన ఓ గర్భిణీ ప్ర సవం కోసం ఆసుపత్రికి వస్తే మత్తు మందు ఇచ్చే వైద్యులు లేకుండానే ఆయన పేరుపై ఫోర్జరీ సంతకాలు చేసి ఆసుపత్రికి చెందిన వైద్యులు సుబ్బారెడ్డి మత్తు మందు ఇచ్చిన ట్లు... మత్తు మందు ఇచ్చే వైద్యుని సమాచా రం మేరకు వివరాలు వెల్లడించినట్లు తెలిపా రు. నిబంధనల ప్రకారం మత్తుమందు ఇచ్చే వైద్యులు పేషెంట్ పరిస్థితి ఆధారంగా మత్తు మందు ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా పేషెంట్‌కు ఎక్కువ మోతాదులో ఇస్తే పేషెం ట్ ప్రాణానికే ప్రమాదం వచ్చే అవకాశం కూ డా ఉంది. అలాగే గర్భిణీకి శస్త్ర చికిత్స చేసే గైనకాలజిస్టు లేకుండా ఆపరేషన్ చేసి ఉంటా రని ఆరోపణలు కూడా లేకపోలేదు. అలాంటి వివరాలను కూడా పూర్తిస్థాయిలో విచారణ చేసి సంబంధిత వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని ఆయన తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులలో తెలిసీ తెలియని వై ద్యులు అర్హతకు మించి ఆపరేషన్లు చేసి ప్రా ణాల మీదకు వచ్చిన అనంతరం ఇతర ఆసు పత్రులకు వెళ్లాలని సూచిస్తుంటారు. కావున ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు చేసుకు నే విధంగా ప్రతినిథ్యం గ్రామాల్లో ఏఎన్‌ఎం ఆశా కార్యకర్తల ద్వారా అవగాహన కల్పిస్తు న్న పరిస్థితి మారడం లేదు. ఇప్పటికైనా గుర్తి ంచి ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు చే సుకునే విధంగా గ్రామాల్లో అవగాహన పెం చాలి. ఈ కార్యక్రమంలో వైద్యులు వంశీకృష్ణ, డెమో రవికుమార్, రాజు ఉన్నారు.
Updated Date - Apr 19 , 2025 | 11:25 PM