భూభారతి చట్టంతో సత్వర న్యాయం
ABN, Publish Date - Apr 24 , 2025 | 11:24 PM
ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంతో ప్రతీ రైతుకు సత్వర న్యాయం అందుతుందని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.
- అవగాహన సదస్సులో గద్వాల కలెక్టర్ సంతోష్
మల్దకల్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంతో ప్రతీ రైతుకు సత్వర న్యాయం అందుతుందని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. ఈ చట్టం ద్వారా వివాదాలను తక్షణమే పరిష్కరిం చడంతో పాటు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పా టు చేసిన భూ భారతి చట్టం-2025 అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మా ట్లాడారు. ఈ చట్టంలో అన్నిరకాల అప్లికేషన్స్ ఉన్నాయని, హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణ చేసుకోవచ్చని, రిజిస్ర్టేషన్, మ్యూటేషన్ చేయడా నికి ముందు భూముల సర్వే, మ్యాపింగ్, వారస త్వ భూములు, పెండింగ్ సాదాబైనామా దరఖా స్తుల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుం దని వివరించారు. మనిషికి ఆధార్‌కార్డులాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు చేస్తారని, దీనిద్వారా భూ ఆక్రమణలకు అవకాశం ఉండద న్నారు. గతంలో భూ సమస్యల పరిష్కారానికి కోర్టులకు వెళ్లాల్సి ఉండేదని, ఈచట్టం ద్వారా అలాంటి సమస్యలకు అప్పీల్ చేసుకుంటే కలెక్ట ర్ స్థాయిలో పరిష్కారం లభిస్తుందన్నారు. భూ భారతి చట్టంప్రకారం భూ సంబంధిత సమస్య లను నిర్ధిష్ట గడువులోపు సమస్యను పరిష్కరిస్తా రన్నారు. భూ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చే సేందుకు ప్రతీ గ్రామంలో గ్రామపరిపాలన అధి కారులను నియమించేందుకు ప్రభుత్వం చర్య లు తీసుకుంటుందన్నారు. అవగాహన సదస్సుల అనంతరం అధికారులు గ్రామాల వారీగా రెవె న్యూ సదస్సులు ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరి స్తారన్నారు. రైతులు భూభారతి చట్టంపై అవగా హన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలన్నా రు. అనంతరం పలువురి అనుమానాలు, సందే హాలను కలెక్టర్ నివృత్తి చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీవో శ్రీనివా సరావు, తహసీల్దార్ షాహీదాబేగం, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Updated Date - Apr 24 , 2025 | 11:24 PM