వర్షాలకు ప్రత్యేక టీంలతో ముందస్తు జాగ్రత్తలు
ABN, Publish Date - Jul 26 , 2025 | 11:18 PM
జిల్లాలో భారీ వర్షాల నేపఽథ్యంలో ప్రత్యేక టీంల తో ముందుస్తు చర్యలు చేపడుతున్నామని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం అన్నారు.
- అధికారుల సమావేశంలో కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భారీ వర్షాల నేపఽథ్యంలో ప్రత్యేక టీంల తో ముందుస్తు చర్యలు చేపడుతున్నామని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం అన్నారు. శనివారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రత్యేక అధికారి జి. రవి ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందుస్తు జాగ్రత్త చర్యలపై కలెక్టర్, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ బీఎం సంతోష్ స్పందిస్తూ మాట్లాడుతూ జిల్లాలో మా మూలు సాధారణ వర్షపాతం నమోదైనదని, ప్ర మాదకరమైన పరిస్థితులు లేవన్నారు. అయినప్పటికి జాగ్రత్త చర్యలు చేపడుతున్నామన్నారు. వర్షాల వల్ల శిఽథిలావస్థలో ఉన్న పాతగృహాలు, పాఠశాలలు, కళాశాలలను గుర్తించి నివారణ చర్యలు చేపడతామన్నారు. వర్షాలవల్ల దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతులను సంబంధిత అధికారులు చేపడతారన్నారు. కృష్ణ్ణా, తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో నీటిప్రవాహాన్ని ఎప్పటికప్పు డు గమనించడం జరుగుతుందన్నారు. తాగునీరు కలుషితం కాకుండా పైప్‌లైన్ లీకేజీలను సరిచేయడంతో పాటు క్లోరినేషన్ చేయాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని గ్రామాలు, మునిసిపాలిటీలలో పారిశుధ్య పనులు చేపడ తామన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్నివిధాలుగా అప్రమత్తంగా ఉంటామన్నారు. సమా వేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, అధికా రులు ఉన్నారు.
Updated Date - Jul 26 , 2025 | 11:18 PM