ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జల్లులు
ABN, Publish Date - Jul 25 , 2025 | 11:15 PM
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి, శుక్రవారం జల్లులు పడ్డాయి. నారాయణపేట జిల్లా కోస్గీ మండలంలో 13.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.
వనపర్తి/నారాయణపేట/నాగర్‌కర్నూల్ టౌన్, జూలై25 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి, శుక్రవారం జల్లులు పడ్డాయి. నారాయణపేట జిల్లా కోస్గీ మండలంలో 13.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. కొత్తపల్లి 9.8, దామరగిద్ద 9.3, ఊట్కూర్ 8.5, కృష్ణ 7.8, మద్దూర్ 6.8, నారాయణపేట మండలం లో 6.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిం ది. నాగర్‌కర్నూలు జిల్లా ఊర్కొండ మండలంలో 9.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పెద్ద కొత్తపల్లి మండలంలో 9.4, కల్వకుర్తిలో 7.0, లింగాలలో 6.2, అచ్చంపేట, వెల్దండ మండలాల్లో 6.0, ఉప్పునుంతల, తిమ్మాజిపేట మండలాల్లో 5.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వనపర్తి జిల్లా పెబ్బేరు, ఆత్మకూరులలో 4.6 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు కురిశాయి.
మహబూబ్‌నగర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం 6 గంటల తరువాత వాతావరణం ఒక్కసారి మేఘావృతమై కొద్దిసేపు వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గండీడ్ మండలంలో 11.7, బాలనగర్‌లో 11.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. జడ్చర్లలో రహదారులు జలమయం అయ్యాయి. మిగతా మండలాల్లో చిరు జల్లులు కురిశాయి.
Updated Date - Jul 25 , 2025 | 11:15 PM