అనుమతి లేని వరి విత్తనాలు పట్టివేత
ABN, Publish Date - Jun 18 , 2025 | 11:22 PM
ఎలాం టి అనుమతులు, లైసెన్స్ లేకుండా దొంగ చా టుగా వరి విత్తనాలను అమ్ముతున్న వ్యాపారిని వ్యవసాయ శాఖ ఏవో పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. ఈ
- వ్యాపారిపై కేసు నమోదు
భూత్పూర్, జూన్ 18(ఆంధ్రజ్యోతి); ఎలాం టి అనుమతులు, లైసెన్స్ లేకుండా దొంగ చా టుగా వరి విత్తనాలను అమ్ముతున్న వ్యాపారిని వ్యవసాయ శాఖ ఏవో పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. ఈ సంఘటన బుదవారం మ హబూబ్‌నగర్ జిల్లా, భూత్పూర్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలం లోని తాటికొండ గ్రామ శివారులోని డీసీఎం వాహనంలో వరి బీపీటీ- 5204 200బ్యాగులు, వీటి విలువ రూ.3లక్షలు, అదే విధంగా ఆర్‌ఎన్ ఆర్ 15048 వరి విత్తనాలు 200బ్యాగులు, వీటి విలువ రూ.2.50లక్షలు, అదే విధంగా కేఎన్‌ఎం 7715రకం వరి విత్తనాలు 250 బ్యాగులు, వీటి విలువ రూ.3.12లక్షలు ఉన్నట్లుగా వ్యవసాశాఖ అధికారి మురళీధర్ అంచనా వేశారు. అయితే ఈ విత్తనాలు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లోని పెద్దయ్యాపల్లి పరకాల చౌరస్తాలో ఉన్న సీడ్స్ ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి గద్వాలలోని రాజరాజేశ్వరి ట్రేడర్స్‌కు వెళ్లాల్సి ఉంది. వ్యాపారి చంద్రశేఖర్‌రెడ్డి భూత్పూర్ మండలంలోని తాటికొండ గ్రామ శివారులో డీసీఎంలో ఉన్న కేఎన్‌ఎం-7715 వరి విత్తనాలు 250బ్యాగులను వ్యాపారి స్థానిక రైతులకు ఎలాంటి బిల్లులు లేకుండా వరి విత్తనాలను అమ్ముతున్న విషయాన్ని మండల వ్యవసాయశాఖ అధికారి మురళీధర్ విశ్వనీయవర్గాల సమాచారం మేరకు వెళ్లి పరిశీలించారు. డీసీఎంలో పైన పేర్కొన్న విత్తనాలు ఎలాంటి అనుమతులు లేకుండా అమ్ముతున్నట్లుగా గుర్తించి పోలీసు లకు ఫిర్యాదు చేశారు. విత్తన యాక్టు ప్రకారం అనుమతులు లేని విత్తనాలు అమ్ముతున్న గద్వాలకు చెందిన శ్రీరాజరాజేశ్వరి ట్రేడర్స్ దుకాణ యజమానిపై కేసు నమోదు చేసినట్లుగా ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు.
Updated Date - Jun 18 , 2025 | 11:22 PM