నిషేధిత బీజీ-3 పత్తి విత్తనాల పట్టివేత
ABN, Publish Date - May 23 , 2025 | 11:18 PM
కేంద్ర ప్రభుత్వం నిషేధించిన బీజీ-3 రకం పత్తి విత్తనాలను మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గోప్లాపూర్ గ్రామంలో పట్టుకున్నారు.
- జడ్చర్ల మండలం గోప్లాపూర్‌లోని ఓ ఇంట్లో 30 కిలోల పత్తి విత్తనాలు స్వాధీనం
జడ్చర్ల, మే 23 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం నిషేధించిన బీజీ-3 రకం పత్తి విత్తనాలను మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గోప్లాపూర్ గ్రామంలో పట్టుకున్నారు. వ్యవసాయ శాఖ, పోలీస్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన 8 టాస్క్‌పోర్స్ బృందాలతో శుక్రవారం గోప్లాపూర్ గ్రామంలోని అనుమానిత ఇళ్లలో సోదాలు నిర్వహించారు. మధుసూదన్‌రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ఎలాంటి లైసెన్స్, రశీదులు లేకుండా నిల్వ ఉన్న 30 ప్యాకెట్‌లలో 30 కిలోల నిషేధిత బీజీ-3 రకం పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. గోప్లాపూర్ గ్రామంలో నిషేధిత పత్తి విత్తనాలను విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ఈ దాడులు జరిగాయి. ఇదిలా ఉండగా తాను 13 ఎకరాలలో పత్తి పంట పండించేం దుకు 30 కిలోల బీజీ-3 రకం పత్తి విత్తనాలను ఆంధ్ర ప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నుంచి తీసుకువచ్చానని విత్తనాలు కలిగి ఉన్న మధుసూదన్‌రెడ్డి చెప్పారు. ఎ వరికీ అమ్మడంలేదని, తనకోసమే తెచ్చుకున్నాన న్నాడు. పట్టుబడిన పత్తి విత్తనాలతో దాదాపు 70 ఎకరాలలో పండించవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడిం చడం గమనార్హం. ఈ కార్యక్రమంలో జడ్చర్ల ఇన్‌చార్జి ఏడీఏ కృష్ణకిశోర్, ఏవో గోపీనాథ్, నేషనల్ ఫుడ్ సెక్యూ రిటీ మిషన్ జిల్లా కన్సల్టెంట్ రామకృష్ణ ఉన్నారు.
15 టాస్క్‌ఫోర్స్ బృందాల ఏర్పాటు
నిషేధిత బీజీ-3 రకం పత్తివిత్తనాలపై జిల్లా వ్యాప్తంగా 15 టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసాము. నమ్మదగిన సమా చారం మేరకు గోప్లాపూర్ గ్రామంలో 8 టా స్క్‌పోర్స్ బృందాలతో సోదాలు నిర్వహిం చగా మధుసూదన్‌రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో 30 కిలోలు పట్టుబడ్డాయి. వీటి విలువ సుమారు రూ. 1.5 లక్షలు ఉంటుంది. వాటిని టూల్‌కిట్‌తో స్ట్రిప్‌టెస్ట్ నిర్వ హించ గా నిషేధిత పత్తి విత్తనాలుగా వెల్లడైంది. ఈ ఘటనపై వ్యవసాయ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు జడ్చర్ల సీఐ కమలాకర్ చెప్పారు.
- వెంకటేశం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
Updated Date - May 23 , 2025 | 11:18 PM