ఉపాధ్యాయులకు నేటి నుంచి రెండో విడత శిక్షణ
ABN, Publish Date - May 19 , 2025 | 11:22 PM
జిల్లాలోని పలు పాఠశాలలో బిల్డింగ్ కెపాసిటీపై ఉపాధ్యాయులకు రెండో విడత వృ త్యంతర శిక్షణ నేటి (మంగళవారం) నుంచి ప్రారంభంకానుందని జోగుళాంబ గద్వాల జిల్లా ఇన్‌చార్జి డీఈవో అబ్దుల్ ఘని తెలిపారు.
గద్వాల సర్కిల్, మే 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు పాఠశాలలో బిల్డింగ్ కెపాసిటీపై ఉపాధ్యాయులకు రెండో విడత వృ త్యంతర శిక్షణ నేటి (మంగళవారం) నుంచి ప్రారంభంకానుందని జోగుళాంబ గద్వాల జిల్లా ఇన్‌చార్జి డీఈవో అబ్దుల్ ఘని తెలిపారు. ఈనెల 24వ తేదీ వరకు ఆయాసబ్జెక్టు ఉపాధ్యాయులకు కే టాయించిన పాఠశాలలో బిల్డింగ్ కెపాసిటీ(సామర్థ్య నిర్మాణం) అంశాలపై శిక్షణ పొం దిన డీఆర్పీలు అవగాహన కల్పిస్తారని పే ర్కొన్నారు. జీహెచ్‌ఎం, కేజీబీవీ ఎస్‌వోలకు గద్వాల శివారు ఎస్‌ఆర్ విద్యానికేతన్‌లో, సోషల్ స్టడీస్, ఇంగ్లిష్ సబ్జెక్టు ఉపాధ్యాయు లకు అలంపూర్ చౌరస్తాలోని విశ్వశాంతి జూనియర్ కళాశాలలో, గణితం, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టు ఉపాధ్యాయులకు గద్వాలలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో, తెలుగు, హిందీ ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో, పీడీ, పీఈటీ, సీఆర్టీ, బయోసైన్స్ సబ్జెక్టు ఉపాధ్యాయులకు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో కొనసాగనున్నాయని వివరించారు.
Updated Date - May 19 , 2025 | 11:22 PM