ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పారిశుధ్య కార్మికులకు వేతనాలు అందించాలి

ABN, Publish Date - Mar 17 , 2025 | 10:59 PM

గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు వెంటనే అమలు చేయాలని ట్రేడ్‌ యూనియన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా (టీయూసీఐ) జిల్లా ప్రధాన కార్యదర్శి బోయినపల్లి రాము ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

మరికల్‌లో ఎంపీడీవో కొండన్నకు వినతిపత్రం అందజేస్తున్న కార్మికులు

- టీయూసీఐ డిమాండ్‌

- పరిషత్‌ కార్యాలయాల ముందు ధర్నా

మరికల్‌/దామరగిద్ద/మాగ నూరు, మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు వెంటనే అమలు చేయాలని ట్రేడ్‌ యూనియన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా (టీయూసీఐ) జిల్లా ప్రధాన కార్యదర్శి బోయినపల్లి రాము ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం మరికల్‌ మండల కేంద్రంలో పారి శుధ్య కార్మికులు టీయూసీఐ ఆధ్వర్యంలో మం డల పరిషత్‌ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ఎంపీడీవో కొండన్నకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన పారిశుధ్య కార్మికుల సేవలను కొనియాడారు. వారి సమస్యలను వివరించారు. ఐదు నెలలుగా వేతనాలు అందక కార్మికులు అవస్థలు పడుతున్నారని వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వారికి నెలనెలా వేతనాలు అందించి ఆదుకోవాలని కోరారు. టీయూసీఐ నాయకులు, పంచాయతీ కార్మికులు ఉన్నారు.

అదేవిధంగా, దామరగిద్ద ఎంపీడీవో కార్యాలయం ముందు టీయూసీఐ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు వేతనాల కోసం ధర్నా చేపట్టారు. పీడీఎస్‌యూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రామకృష్ణ, జిల్లా కార్యదర్శి బి.నర్సిములు మా ట్లాడారు. అనంతరం కార్యాలయంలో అధికారు కు వినతిపత్రం అందించారు. పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకుడు మహ దేవ్‌, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సాయి, పీవైఎల్‌ జిల్లా సహాయ కార్యదర్శి సలీం, మధు, రాజు, పంచాయతీ కార్మికులు వెంకటప్ప, చాంద్‌ పాషా, వెంకటప్ప, లింగప్ప, రాజు, సిద్దనాయక్‌, రవి, థామస్‌, రాకేష్‌ తదితరులున్నారు.

మాగనూరులో టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఏజీ భుట్టో, గ్రామ పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకుడు ఆశప్ప ఆధ్వర్యంలో సోమవారం ఎంపీడీవో రహమతుద్దీన్‌కు వినతిపత్రం ఇచ్చారు. పంచాయతీ కార్మికులకు ప్రతీనెల ఈ-కుబేర్‌ ద్వారా వేతనాలు ఇవ్వాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్‌ అమలు చేయాలని, మల్టీపర్పస్‌ జీవో 501 రద్దు చేయాలని ఏజీ భుట్టో ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు రాకేష్‌, మారెప్ప, నరసింహ తదితరులున్నారు.

Updated Date - Mar 17 , 2025 | 10:59 PM