‘మహాలక్ష్మి’తో ఆర్టీసీకి పునర్‌వైభవం
ABN, Publish Date - Jul 23 , 2025 | 11:38 PM
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ పథకంత ఆర్‌టీసీకి పునర్వైభవం తీసుకొచ్చింద ని వనపర్తి శాసనసభ్యుడు తూడి మేఘారెడ్డి అన్నారు.
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి
మహిళా ప్రయాణికులకు ఘన సన్మానం
వనపర్తి రూరల్, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ పథకంతో ఆర్‌టీసీకి పునర్వైభవం తీసుకొచ్చింద ని వనపర్తి శాసనసభ్యుడు తూడి మేఘారెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో 200 కోట్ల ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా బుధవా రం వనపర్తి బస్‌స్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్టీసీని బ్రష్టు పట్టించిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిం దని తెలిపారు. తద్వారా ఆక్యుపెన్సీ పెరిగి, నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల బాట పట్టింద న్నారు. వనపర్తి బస్ డిపో ద్వారా 2014 నుంచి 2023 వరకు ఆర్టీసీ రూ. 57 లక్షలు ఆర్జించిం దని తెలిపారు. 2023, డిసెంబర్ 9-2024 వరకు రూ. 12.4 కోట్లు, 2024-25లో 23.09 కోట్లు ఈ ఏడాది ఇప్పటి వరకు రూ. 7 కోట్లు లాభాలు వచ్చినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మహిళలు 2.35 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి నట్లు చెప్పారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ త్వరలో జిల్లాకు రాను న్నారని తెలిపారు. 10 కొత్త ఎలక్ర్టిక్ బస్సులను ప్రారంభించనున్నారని చెప్పారు. అదే విధంగా సబ్ రిజిస్ట్రార్, ఆర్టీఏ కార్యాలయ భవన నిర్మా ణానికి భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం మహిళా ప్రయాణికులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ పి.శ్రీనివాస్ గౌడ్, డిపోమేనేజర్ వేణుగోపాల్, మునిసిపల్ కమిషనర్ వెంకటే శ్వర్లు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు స్వరూప, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు శ్రీలతారెడ్డి, మాజీ కౌన్సిలర్లు భువనేశ్వరి, జయసుధ పాల్గొన్నారు.
Updated Date - Jul 23 , 2025 | 11:38 PM