ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పోడు భూములపై హక్కులు కల్పించాలి

ABN, Publish Date - May 28 , 2025 | 11:37 PM

పోడు భూములపై హక్కులు కల్పించాలని బుధవారం శ్రీశైలం - హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై చెంచులు రాస్తారోకో చేశారు.

శ్రీశైలం- హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేస్తున్న సార్లపల్లి రైతులు

శ్రీశైలం-హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై చెంచుల రాస్తారోకో

దోమలపెంట, మే 28 (ఆంధ్రజ్యోతి): పోడు భూములపై హక్కులు కల్పించాలని బుధవారం శ్రీశైలం - హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై చెంచులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా చెంచు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షు డు చిగుర్ల మల్లికార్జున్‌ మాట్లాడుతూ చెంచు రైతులకు అటవీ హక్కుల చట్టం కింద నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట మండలం సార్లపల్లి పంచాయతీ పరిధిలోని రాసమొళ్ల బావి పెంటలో పోడు భూములకు 20 ఏళ్ల క్రితం ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని తెలి పారు. కానీ స్థానిక అటవీశాఖ అధికారులు ఆ భూములను సాగు చేయకుండా అడ్డుకుం టున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వయం గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెంచులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇచ్చి పండ్ల తోటల పెంపకానికి ప్రో త్సహించాలని చెబుతున్నా అటవీశాఖ అధికా రులు మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహ రిస్తున్నారని వాపోయారు. అచ్చంపేట నియో జకవర్గంలోని చెంచులు సాగు చేసుకుంటున్న పోడు భుములకు పట్టాలు ఇస్తూ, బ్యాంకు రుణాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాస్తారోకో చేయడంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ఈగలపెంట ఎస్‌ఐ శ్రీనువాసులు అక్కడికి చేరుకుని చెం చులతో మాట్లాడి రాస్తారోకో విరమింపజేశా రు. కార్యక్రమంలో తిరుపతయ్య, మానయ్య, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

అడవిని నరికితే కఠిన చర్యలు..

రాసమొళ్లబావి పెంటలో 6 మంది గిరిజన రైతులకు 8 ఎకరాల పోడు పట్టా ఉన్నదని దోమలపెంట ఎఫ్‌ఆర్‌వో గురు ప్రసాద్‌ తెలి పారు. వారు అక్కడ వ్యవసాయం చేసుకునేం దుకు ఎటువంటి అభ్యంతరం లేదని, వారికి ఉన్న భూమికన్నా ఎక్కువ భూమిని సాగు చేసేందుకు అడవిని నరికితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - May 30 , 2025 | 03:02 PM