చోరీల నివారణకు ఆకస్మిక తనిఖీ
ABN, Publish Date - Jun 18 , 2025 | 10:53 PM
జిల్లా కేంద్రంలో చోరీల నివార ణకు బుధవారం బ్యాంకులు, ఏటీఎం వద్ద, బ స్టాండ్, ప్రధాన చౌరస్తాలలో ఫింగర్ ప్రింట్ డివైజ్‌తో పోలీసులు ఆకస్మిక తనిఖీ నిర్వహిం చినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
నారాయణపేట న్యూటౌన్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో చోరీల నివార ణకు బుధవారం బ్యాంకులు, ఏటీఎం వద్ద, బ స్టాండ్, ప్రధాన చౌరస్తాలలో ఫింగర్ ప్రింట్ డివైజ్‌తో పోలీసులు ఆకస్మిక తనిఖీ నిర్వహిం చినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలు బస్సు ఎక్కేటప్పడు దిగేటప్పుడు తమ విలువైన బంగారు వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలని, బ్యాంకుల వద్ద లావాదేవీలు జరపడానికి వెళ్లే వారు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. డ బ్బులు డ్రా చేసుకొని వెళ్లే సమయంలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు.
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
మక్తల్: వాహనదారులు రోడ్డు భద్రతా ని యమాలు పాటించాలని ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని సంగంబండ రోడ్డు-167పై వాహనాల తనిఖీ చేశారు. 18 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి రూ.7,545 జరిమానా విధించినట్లు తెలిపారు. అతివేగంగా వాహనాలు నడపరాదని, ర్యాష్ డ్రై వింగ్ చేయరాదన్నారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. పట్టణంలోని బస్టాండ్, బ్యాం కులు, ఏటీఎంల వద్ద అనుమనిత వ్యక్తుల వద్ద ఫింగర్‌ప్రింట్స్‌తో తనిఖీ చేశారు. చోరీల నివారణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.
Updated Date - Jun 18 , 2025 | 10:53 PM