ఆపరేషన్ సిందూర్ సక్సెస్‌పై ర్యాలీ
ABN, Publish Date - May 07 , 2025 | 11:44 PM
పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించి ఉగ్ర శిబిరాలను సర్వనాశనం చేసిందని ఈ సక్సె స్ భారత్ సైనికులకు అంకితమని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బండల వెంకట్రాములు అన్నా రు.
గద్వాల, మే 7(ఆంధ్రజ్యోతి): కశ్మీర్‌లో పహాల్గాంలో ఉగ్రవాదుల దాడికి ప్రతీకగా పాక్ ఆక్ర మిత కశ్మీర్‌తో పాటు పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించి ఉగ్ర శిబిరాలను సర్వనాశనం చేసిందని ఈ సక్సె స్ భారత్ సైనికులకు అంకితమని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బండల వెంకట్రాములు అన్నా రు. బుధవారం రాత్రి ఆపరేషన్ సిందూర్ సక్సెస్‌పై బీజేపీ, ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ర్యాలీ నిర్వహించారు. గాంధీచౌక్ నుంచి ప్రధాన రహదారు లవెంట ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బం గా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదులు వారికి మద్దతు పలికే పాకిస్థాన్ భారత్ వైపు కన్నెత్తి చూస్తే మోదీదెబ్బకు బలి కావా ల్సిందేనని అన్నారు. పహల్గాం బా ధిత కుటుంబాలతో పాటు ప్రజల కు ఇచ్చిన హామీ మేరకు నరేంద్ర మోడీ ఉగ్రవాదులపై యుద్ధం ప్రకటించాడని అన్నారు. ఉగ్రవాదులకు అండగా ఉండే వారికి కూడా బుద్ధి చెబుతానని చెప్పిన ప్రధాని, అది కూడా త్వరలో నెరవేర్చి తీరుతాడని, ఆ నమ్మ కం భారత్ ప్రజలకు ఉందన్నారు. భారత్ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధికి ప్రధాన్యం ఇస్తుందని, దానికి భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా ప్రధాని మట్టి కరిపిస్తాడని ఇదివరకు జరిగి జర్జికల్ స్ర్టైక్ వంటివి చూశామని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రజలు చేయాల్సిందంతా భార త త్రివిధ దళాలకు మద్దతు ఇవ్వడమేనన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయు లు, నాయకులు గోపాలరావు ఎగ్బోటే, చాగాపు రం ప్రదీప్, కరేంద్రనాథ్ పాల్గొన్నారు.
Updated Date - May 07 , 2025 | 11:44 PM