ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రైతులకు నాణ్యమైన విత్తనాలు

ABN, First Publish Date - 2025-05-28T23:13:33+05:30

రైతులకు మెరుగైన విత్తనాలు అందించేందుకు అ ధికారులు, సీడ్‌ ఆర్గనైజర్లు, సీడ్‌ కంపెనీలు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు.

కలెక్టర్‌ బీఎం సంతోష్‌

గద్వాల న్యూటౌన్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): రైతులకు మెరుగైన విత్తనాలు అందించేందుకు అ ధికారులు, సీడ్‌ ఆర్గనైజర్లు, సీడ్‌ కంపెనీలు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. బుధవారం ఐడీవోసీ సమావేశపు హాలులో పత్తివిత్తన ఉత్పత్తిపై వ్యవసాయశాఖ అధికారులు, సీడ్‌ కంపెనీలు, సీడ్‌ ఆర్గనైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సం దర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ. ఈ సంవత్సరం వర్షాలు అనుకూలంగా ఉన్నాయని, కాబట్టి పం ట నష్టం లేకుండా, రైతులకు మంచి ఆదాయం అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా లో పత్తివిత్తనాలే ప్రధాన ఆదాయ మార్గం కావడంతో సుమారు 30,000 ఎకరాల్లో సాగు కొనసాగుతూ 35,000 నుంచి 40,000 మంది రైతు లు విత్తన ఉత్పత్తి చేస్తున్నారన్నారు. అధికారులు, సీడ్‌ ఆర్గనైజర్లు, సీడ్‌ కంపెనీలు పరస్పరం సమన్వయంతో పనిచేసి రైతులకు మంచి దిగుబడి కలగడానికి, అందరికీ లాభం చేకూరడానికి కృషి చేయాలన్నారు. ఈ ఏడాది విత్తన ఉత్పత్తి సంబంధించి కంపెనీలు తమ కార్యాచరణ ప్ర ణాళికను సమర్పించాలన్నారు. గత సంవత్సరానికి చెందిన మొత్తం విత్తన ఉత్పత్తి వివరాలతో పాటు ఎంతమంది రైతుల విత్తనాలు జీవోటీ ప రీక్షల్లో ఉత్తీర్ణమయ్యిందో, ఎంత పరిమాణం విఫలమైందో వివరించిన జాబితాను సమర్పించాల ని స్పష్టంగా ఆదేశించారు. సీడ్‌ ఉత్పత్తి చేస్తున్న రైతులకు సీడ్‌ కంపెనీలు సాంకేతిక సహాయం అందించాలన్నారు. ఎండ, భారీ వర్షాలు, తెగుళ్లు, వ్యాధులు వంటి కష్టకాల పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో కంపెనీలు క్రమం తప్పకుండా రైతులకు నిపుణుల సహకారంతో శిక్షణ ఇవ్వాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ జగ్గునాయక్‌, జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్‌, ఏడీఏ సంగీతలక్ష్మి, టెక్నికల్‌ ఏడీఏ రమేశ్‌, అధికారులు, సీడ్‌ఆర్గనైజర్లు, సీడ్‌ కంపెనీల ప్రతినిధులు ఉన్నారు.

Updated Date - 2025-05-28T23:13:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising