ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ABN, Publish Date - May 05 , 2025 | 11:09 PM
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
నారాయణపేట టౌన్, మే 5 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశపు హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. కార్యక్ర మంలో 32 దరఖాస్తులు రాగా అత్యధికంగా భూసమస్యలు, ఇతర శాఖలకు సంబంధించి నవి ఉన్నాయి. దరఖాస్తులను సంబంధిత అధికారులకు బదిలీ చేసి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఆర్డీవో రాంచందర్, వివిధ జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Updated Date - May 05 , 2025 | 11:09 PM