ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజా ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి

ABN, Publish Date - May 26 , 2025 | 11:16 PM

ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ పోలీసు అధికారులను ఆదేశించారు.

ఫిర్యాదులపై అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతున్న ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌

- ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌

నారాయణపేట, మే 26 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజావాణిలో భాగంగా ఎస్పీ కార్యాలయానికి వచ్చి న 8 మంది అర్జిదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడారు. ఇందులో భూతగాదాలకు సంబంఽ దించి మూడు, ఆస్తి తగాదాలు రెండు, ఫ్యామిలీ గొడవలు రెండు, డబ్బులు రాలేదని ఒక ఫిర్యాదు వచ్చింది. బాధితుల సమస్యలు విన్న పరిష్కారానికి సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. భూతగాదాలను రెవె న్యూ అధికారులతో మాట్లాడి పరిష్కరించుకో వాలన్నారు.

పెండింగ్‌ కేసులను పరిష్కరించాలి

నారాయణపేట న్యూటౌన్‌ : పెండింగ్‌ కేసు లను న్యాయ అధికారుల సమన్వయంతో పరి ష్కరించాలని ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయం కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆయన జిల్లా పోలీస్‌ అధికారులు, కోర్టు డ్యూటీ అధికారులతో ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జాతీయ లోక్‌ అదాలత్‌లో న్యాయ అధికారుల సమన్వయంతో పెండింగ్‌ కేసులను ఆన్‌లైన్‌ ప్రొజెక్టర్‌ ద్వారా వివరించి అధిక మొత్తంలో పరిష్కరించాలని సూచించారు. జిల్లా పరిధిలో సైబర్‌ నేరాలకు సంబంధించి రకరకాల బ్యాంకులలో అమౌంట్‌ ఫ్రీజ్‌ అయి ఉన్నాయని, అలాంటి కేసులను బ్యాంకు అధికారులతో మాట్లాడి బాధితులకు సంబంధించిన అమౌంట్‌ క్లెయిమ్‌ అయ్యే విధంగా లోక్‌ అదాలత్‌లో పరిష్కరించాలన్నారు. ప్రతీ కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్‌ త్వరగా పూర్తి చేసి నిర్జీత సమయంలో కేస్‌ ఫైల్‌ కోర్టుకు పంపే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. వీలైనన్ని ఎక్కువ కేసుల్లో దోషులకు శిక్ష పడేలా చూడాలని, పోక్సో, అత్యాచార కేసుల్లో దోషులు తప్పించుకోడానికి వీలు లేదన్నారు. చట్టం మందు దోషులకు శిక్ష పడినప్పుడే నేరం చేయడానికి వెనుకడుగు వేస్తారని, దీంతో పోలీసులపై ప్రజలకు నమక్మం పెరుగుతుంద న్నారు. సమావేశంలో సీఐలు రామ్‌లాల్‌, రాజేందర్‌రెడ్డి, సైదులు, ఎస్‌ఐలు, కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2025 | 11:16 PM