‘భూ భారతి’తో సమస్యలు పరిష్కారం
ABN, Publish Date - Jun 04 , 2025 | 10:45 PM
భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలను పరిష్కారమవుతాయని అదునపు కలెక్టర్ వెంక టేశ్వర్లు అన్నారు. బుధవారం మండలంలోని కంచిరావుపల్లి గ్రామంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో పాల్గొని దరఖాస్తు లను పరిశీలించారు.
- అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
పెబ్బేరు రూరల్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలను పరిష్కారమవుతాయని అదునపు కలెక్టర్ వెంక టేశ్వర్లు అన్నారు. బుధవారం మండలంలోని కంచిరావుపల్లి గ్రామంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో పాల్గొని దరఖాస్తు లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ.. భూములపై రైతులకు పూర్తి హక్కు లను కల్పించేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని అ మల్లోకి తీసుకొచ్చిందన్నారు. కంచిరావుపల్లిలో 14, రంగాపురంలో 32 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో తహ సీల్దార్ మురళీగౌడ్, నయాబ్ తహశీల్దార్ నంద కిశోర్, ఆర్‌ఐ రాఘవేందర్‌రావు, జూనియర్ అసిస్టెంట్ మధు తదితరులు పాల్గొన్నారు.
పెబ్బేరు: మూడు నెలల రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు సక్రమంగా పంపిణీ చేయాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. బు ధవారం పట్టణంలోని రేషన్‌షాపును ఆకస్మికం గా తనిఖీ చేశారు. లభ్ధిదారులకు పంపిణీ చేస్తు న్న తీరును పరిశీలించారు.
శ్రీరంగాపూర్: రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మండలంలో జరుగు తున్న రెవెన్యూ సదస్సులను ఆయన సందర్శిం చి భూ రికార్డులను, ప్రజల నుంచి అందిన దర ఖాస్తులను పరిశీలించారు.
వీపనగండ్ల: భూ సమస్యలను పరిష్కరించేం దుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు త హసీల్దార్ వరలక్ష్మి తెలిపారు. బుధవారం మం డలంలోని తూముకుంటలో రెవెన్యూ సదస్సులు ప్రారంభించారు. గ్రామంలో రెండు రోజులు సదస్సులు నిర్వహించడం జరుగుతుందని, 59 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
రెవెన్యూ సదస్సులో 15 దరఖాస్తులు
ఖిల్లాఘణపురం: మండలంలోని ఆగారం, వెంకటాంపల్లి గ్రామాల్లో బుధవారం నిర్వహిం చిన భూ భారతి రెవెన్యూ సదస్సులో 15 దర ఖాస్తులు రైతుల నుంచి స్వీకరించినట్లు తహ సీల్దార్ సుగుణ తెలిపారు. నయాబ్ తహసీ ల్దార్ లక్ష్మీకాంత్, ఆర్‌ఐ తిరుపతయ్య, సూపరిం టెండెంట్ కురుమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.
ఆత్మకూరు: భూ సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం భూ భారతి చట్టం అమలు చేస్తుం దని తహసీల్దార్ చాంద్‌పాషా పేర్కొన్నారు. పి న్నంచర్ల, బాలకృష్ణాపూర్ గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. పిన్నంచర్లలో నాలుగు, బాలకృష్ణాపూర్‌లో 14 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు.
చిన్నంబావిలో 43ఫిర్యాదులు
చిన్నంబావి: మండలంలోని వెలగొండ, చిన్న మారూర్ గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సద స్సులో భూ సమస్యలకు సంబంధించి 43 ఫిర్యా దులు రైతుల నుంచి స్వీకరించినట్లు తహసీ ల్దార్ ఇక్బాల్ తెలిపారు.
పాన్‌గల్: రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ సత్య నారాయణరెడ్డి అన్నారు. దావాజీపల్లి, వెంగళా యిపల్లి సదస్సులు ఏర్పాటు చేశారు. దావాజీ పల్లిలో 18, వెంగళాయిపల్లిలో 11 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
Updated Date - Jun 04 , 2025 | 10:45 PM