ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సమస్యలు గుర్తించి పరిష్కరించాలి

ABN, Publish Date - Jun 04 , 2025 | 10:43 PM

పట్టణంలోని ప్రభుత్వ జూని యర్‌ కళాశాలను బుధవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పరిశీలించి అధ్యాపకులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమస్యలను తెలుసుకుంటున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

- జూనియర్‌ కళాశాలను పరిశీలించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి విద్యా విభాగం, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని ప్రభుత్వ జూని యర్‌ కళాశాలను బుధవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పరిశీలించి అధ్యాపకులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళాశాల పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, తరగతి గదు లు, మరుగుదొడ్లు, ల్యాబ్‌ గదులు, కంప్యూటర్‌ ల్యాబ్‌ పూర్తిగా శిథిలమైపోయాయని తెలిపారు. నీటి వసతి లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని అధ్యాపకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే వారం రోజుల్లో కళాశాలలోని సమస్యలను పరిష్కరిం చాలని అధికారులను ఆదేశించారు. మార్చి 2వ తేదీన విద్యాలయాల పునర్నిర్మాణానికి ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారని దానికి అనుగుణంగా పనులు చేపడుతున్నామ ని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో వినోద్‌ కుమార్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివా స్‌గౌడ్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

వనపర్తి టౌన్‌: మునిసిపాలిటీలో పని చేస్తు న్న అధికారులు, సిబ్బంది పాత అలవాట్లను ప క్కన పెట్టి పట్టణ అభివృద్ధి కోసం పని చేయా లని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధ వారం జిల్లా కేంద్రంలోని మునిసిపాలిటీ కార్యా లయంలో నిర్వహించిన 100 రోజుల కార్యక్ర మంలో ఆయన పాల్గొన్నారు. వార్డు అధికారు లు, మెప్మా ఆర్పీలు, జవాన్లు నిరంతరం పట్టణ ప్రజలకు అందించే సేవలు అభినందనీయమ న్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి వనపర్తిపై ఉందని, త్వరితగతిన అభివృద్ధి చెం దే పట్టణాభివృద్ధిలో మీరందరూ భాగస్వాము లు కావాలన్నారు. సమావేశంలో మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, మధుసూదన్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఉమామహేశ్వర్‌రెడ్డి, అధికా రులు, సిబ్బంది పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ నాయకులు

పెబ్బేరు: పట్టణంలోని 1వ వార్డుకు చెందిన 30మంది బీఆర్‌ఎస్‌ నాయకులు గంధం ఉత్తం కుమార్‌ నేతృత్వంలో బుధవారం క్యాంపు కార్యా లయంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సమ క్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్‌ కండువ కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్‌ పార్టీ మహిళా అభివృద్ధి, నిరుపేదల అభ్యున్నతి కో సం కృషి చేస్తున్నందుకు ఆకర్షితులమై హస్తం గూటికి చేరుకున్నట్లు వెల్లడించారు. కార్యక్ర మంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మెన్‌ విజయ వర్ధన్‌రెడ్డి, అక్కి శ్రీనివాస్‌ గౌడ్‌, వెంకటేష్‌ సాగర్‌, వెంకట్‌రాములుయాదవ్‌, రాజశేఖర్‌, సు రేందర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 10:43 PM