సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
ABN, Publish Date - May 11 , 2025 | 11:31 PM
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మం డలం మాచారం గ్రామాన్ని ఇందిర సౌరగిరి జల వికాసం పథకానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు.
- ఇందిర సౌర గిరి జల వికాస పథకం
పైలట్ ప్రాజెక్టు గ్రామంగా మాచారం
- పోడు భూముల్లో బోర్వెల్ డ్రిల్లింగ్ పనులను పరిశీలించిన కలెక్టర్, ఐటీడీఏ పీవో
అమ్రాబాద్, మే 11 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మం డలం మాచారం గ్రామాన్ని ఇందిర సౌరగిరి జల వికాసం పథకానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 18న ఇందిర సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించడానికి మాచారం వస్తున్న సం దర్భంగా ఆదివారం నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్, వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈపథకం అమలులో భాగం గా ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు ఉన్న భూముల్లో బోరుబావులు తవ్విస్తున్నారు. ఉన్న బోరుబావులకు వెంటనే సౌర విద్యుత్ ద్వారా విద్యుత్ కనెక్షన్ ఇచ్చి ఈ భూముల్లో పండ్ల తోటలు సాగు చేయించనున్నారు. ప్రస్తుతం మాచారంలో పండ్ల మొక్కలను నాటడానికి నేలను సిద్ధ్దం చేస్తున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, మన్ననూర్ ఐటీడీఏ పీవో రోహిత్ గోపిడి, డీటీడీవో ఫిరంగి, గ్రౌండ్ వాటర్ ఏడీ దివ్యజ్యోతి, డీపీవో మోహన్‌రావు, జిల్లా ఉద్యానవన అధికారులు వెంకటేశం, జగన్, అచ్చంపేట ఆర్డీవో మాధవి, డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌అండ్‌బీ డీఈ జలంధర్, అమ్రా బాద్ తహసీల్దార్ శైలేంద్రకుమార్, ఎంపీడీవో జగదీశ్వర్ ఉన్నారు.
Updated Date - May 11 , 2025 | 11:31 PM