పోలీసుల రాత్రి విధులను పటిష్టం చేయాలి
ABN, Publish Date - Jul 24 , 2025 | 11:35 PM
జిల్లా కేంద్రంలోని రాత్రిపూట పోలీస్ విధులను పటిష్టం చేసి నేరాల నియంత్రణకు కృషి చేయాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు.
- జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
గద్వాల క్రైం, జూలై 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని రాత్రిపూట పోలీస్ విధులను పటిష్టం చేసి నేరాల నియంత్రణకు కృషి చేయాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం పట్టణ పోలీస్‌స్టేషన్‌ను ఆ కస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలోని సీసీటీవీ కెమెరాల పనితీరును పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను, రికార్డులను, సిబ్బంది నిర్వహిస్తున్న విధులను పరిశీలించారు. నేరాల నియంత్రణలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రిపోట పోలీస్ విధులను పటిష్టం చేయాలని, పెట్రోలింగ్, బ్లూకోల్డ్స్, బీట్ డ్యూటీలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతీ ఫిర్యాదుదారునితో సిబ్బంది గౌరవంగా మెలగాలని, వచ్చిన ఫిర్యాదుపై తక్షణమే విచారణ చేపట్టి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐకి సూచించారు. కార్యక్రమంలో గద్వాల సిఐ టంగుటూరి శ్రీను, పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌రావ్, సిబ్బంది ఉన్నారు.
Updated Date - Jul 24 , 2025 | 11:35 PM