ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్లాట్ల యజమానులు ఎల్‌ఆర్‌ఎస్‌ చేసుకోవాలి

ABN, Publish Date - Mar 12 , 2025 | 11:05 PM

తెలంగాణ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ ఎస్‌ రుసుం 25 శాతం తగ్గించిదని ఈనెలాఖరు లోపు ప్లాట్ల యజమానులు ఎల్‌ఆర్‌ఎస్‌ చేసుకొని తగ్గింపు రుసుమును వినియోగించుకోవాలని ముని సిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు కోరారు.

ఎల్‌ఆర్‌ఎస్‌పై నిర్వహించిన సమావేశంలో బిల్డర్లతో మాట్లాడుతున్న మునిసిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు

- మునిసిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు

- టౌన్‌ బిల్డర్లతో సమావేశం

నారాయణపేట, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ ఎస్‌ రుసుం 25 శాతం తగ్గించిదని ఈనెలాఖరు లోపు ప్లాట్ల యజమానులు ఎల్‌ఆర్‌ఎస్‌ చేసుకొని తగ్గింపు రుసుమును వినియోగించుకోవాలని ముని సిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు కోరారు. బుధవారం నారాయణపేట మునిసి పాలిటీలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారి కిరణ్‌కుమార్‌ తో కలిసి పట్టణ బిల్డర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ గురించి వివరించి రెగ్యులరైజ్‌ చేసుకునేలా మీవంతు సహకారం అందించాలని కోరారు. మునిసిపాలిటీ పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం 1205 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. 70 మంది ప్లాట్లదారులకు అప్రూవల్‌ లభించిందన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ చేసుకొంటేనే ప్లాట్లు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. రాయితీ గడువు ముగిసిన తర్వాత ఇప్పటి మా ర్కెట్‌ విలువ ప్రకారం 14 శాతం ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించాల్సి ఉంటుందన్నారు. అనంతరం కమిషనర్‌ భోగేశ్వర్లును టౌన్‌ బిల్డర్లు సదా వెంకట్రా ములు, సాగర్‌ తదితరులు శాలువాతో సత్కరించారు.

Updated Date - Mar 12 , 2025 | 11:05 PM