ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నిబంధనలు పాటిస్తేనే అనుమతులు

ABN, Publish Date - May 09 , 2025 | 11:20 PM

ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని వసతులు ఉంటేనే లే అవుట్లకు అనుమతి వస్తుందని వనపర్తి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న వనపర్తి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

జిల్లాస్థాయి లే అవుట్‌ కమిటీ సమావేశంలో వనపర్తి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

వనపర్తిరాజీవ్‌చౌరస్తా, మే 9 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని వసతులు ఉంటేనే లే అవుట్లకు అనుమతి వస్తుందని వనపర్తి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి లే అవుట్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా డ్రాఫ్ట్‌ లే అవుట్‌ ఆమోదం పొంది ఫైనల్‌ లే అవుట్‌ ఆమోదం కోసం వచ్చిన దరఖాస్తులను కమిటీ సభ్యులు పరిశీలించారు. లే అవుట్‌లలో నిబంధనలకు అనుగుణంగా మౌలిక సదుపాయా లు కల్పించిన 2 లే అవుట్లను కమిటీ షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయా లు అసంపూర్తిగా ఉన్న వాటిని కమిటీ ఆమోదించ లేదు. మొత్తం 7 లే అవుట్లు కమిటీ ముందుకు వ చ్చాయి. నిబంధనల ప్రకారం అన్ని మౌలిక వస తులు ఉంటేనే కమిటీ ద్వారా ఆమోదం పొందు తుందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ... లే అవుట్‌ ఆన్‌లైన్‌లో దరఖాస్తు కా గానే సంబంధిత రోడ్లు భవనాల శా ఖ, ఇరిగేషన్‌, మునిసిపల్‌, విద్యుత్‌, రెవెన్యూ శాఖల అధి కారులు క్షేత్ర స్థాయిలో వెళ్లి పరిశీలించాలన్నా రు. ప్రతీ శాఖకు చెక్‌లిస్టు ఉంటుందని, చెక్‌లిస్టు ప్రకారం చూసుకొని అన్ని నిబంధనలు సరిగ్గా ఉంటే జిల్లా కమిటీకి సిఫారసు చేయాలని ఆదేశించారు. లే అవుట్‌ అనుమతి లేకుండా ఇళ్లు ప్రారంభించిన వారికి నోటీసులు జారీ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంక టేశ్వర్లు, యాదయ్య, ఇరిగేషన్‌ ఇంజనీర్లు, డీఈ ఆర్‌అండ్‌బీ, మునిసిపల్‌ కమిషనర్లు, టీపీవోలు, లే అవుట్‌ యజమానులు, ప్లానర్‌లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2025 | 11:20 PM