ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందించాలి

ABN, Publish Date - Jul 09 , 2025 | 11:23 PM

పాలమూరు - రంగారెడ్డి పెండింగ్‌ ప్రా జెక్టులను పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు రైతంగా నికి సాగునీరు అందించి ఆ దుకోవాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌ యా దవ్‌ అన్నారు.

డీ 82 కాలువను పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

- డీ 82 కాలువను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్‌

చారకొండ, జూలై 9 (ఆంధ్రజ్యోతి) పాలమూరు - రంగారెడ్డి పెండింగ్‌ ప్రా జెక్టులను పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు రైతంగా నికి సాగునీరు అందించి ఆ దుకోవాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌ యా దవ్‌ అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా చార కొండ మండలంలోని జూపల్లి శివారులోని కేఎల్‌ఐ డీ 82 కా లువను రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ హయాంలో కేసీఆర్‌ ప్రాజెక్టుల కోసం రూ.35 వేల కోట్ల నిధులు కేటాయించి రూ. 27.500 కోట్లతో ప్రాజెక్టులను పూర్తి చేశారని గుర్తు చేశారు. ఈ ప్రాంత బిడ్డను అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. కేఎల్‌ఐతో పాటు పాలమూరు - రంగారెడ్డి ప్రాజె క్టులను వెంటనే చేపట్టి సాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జూపల్లిలో ఇటీ వల మృతి చెందిన కడారి వీరయ్య, అంకిళ్ల మైసమ్మ కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఎదిరే రవీందర్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ విజయ్‌గౌడ్‌, మాజీ ఉపసర్పంచ్‌ కలమందల జగపతి, వెల్దండ మాజీ ఎంపీపీ వెంకట య్యగౌడ్‌, నాయకులు పెద్దయ్యయాదవ్‌, తిరుపతయ్యచారి, బిక్షపతి, వెంకటేష్‌, శేఖర్‌గౌడ్‌, రామస్వామి, బిక్కన్‌, వెంకటయ్యగౌడ్‌ శ్రీరాములు, రియాజ్‌, ప్రశాంత్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 11:23 PM