పెండింగ్ బిల్లులను చెల్లించాలి
ABN, Publish Date - Jun 22 , 2025 | 11:26 PM
మెరుగైన పీఆర్సీ ప్రకటించి అ మలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కా ర్యదర్శి రవికుమార్ డిమాండ్ చేశారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని దయనంద విద్యా మంది ర్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాఽధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు శివరా ములు అధ్యక్షతన వహించారు.
- టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్
నారాయణపేట న్యూటౌన్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): మెరుగైన పీఆర్సీ ప్రకటించి అ మలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కా ర్యదర్శి రవికుమార్ డిమాండ్ చేశారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని దయనంద విద్యా మంది ర్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాఽధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు శివరా ములు అధ్యక్షతన వహించారు. ఈ సందర్భం గా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ.. రిటైర్డ్ అయి న ఉపాధ్యాయుల బకాయిలను తక్షణమే చెల్లిం చి, ఈ-కుబేర్‌లో పెండింగ్ బిల్లులను, మిగిలిన డీఏలను వెంటనే చెల్లించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా సీ పీఎస్ రద్దు చేసి, ఓపీఎస్‌ను అమలు చేయా లని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ లుగా ఉన్న ప్రధానోపాధ్యాయుల పోస్టులను భ ర్తీ చేయాలని కోరారు. డిప్యూటీ డీఈవో, ఎం ఈవో పోస్టులను ఉపాధ్యాయులకు పదోన్నతు లు ద్వారా భర్తీ చేయాలన్నారు. మోడల్ స్కూ ల్ టీచర్ల 101 హెడ్ కింద జీతాలు ఇవ్వాలని, అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వా లన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, ఉపాధ్యక్షుడు బాలాజి, కన్వీనర్ రవికుమార్, గోవింద్, వెంకట్ నాయక్, వెంక టేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 22 , 2025 | 11:26 PM