2డే క్రికెట్ టోర్నీలో పాలమూరు గెలుపు
ABN, Publish Date - May 20 , 2025 | 11:01 PM
క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంట్రా డిస్ట్రిక్ట్ 2 డే అండర్-23 క్రికెట్ టోర్నీలో మహబూబ్‌నగర్ జట్టు జడ్చర్లపై 49 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది.
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, మే 20 (ఆంధ్రజ్యోతి) : క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంట్రా డిస్ట్రిక్ట్ 2 డే అండర్-23 క్రికెట్ టోర్నీలో మహబూబ్‌నగర్ జట్టు జడ్చర్లపై 49 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్‌లో మహబూబ్‌నగర్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 420 పరుగులకు డిక్లేర్ చేసింది. నగరం సమీపంలోని తిరుమలహిల్స్‌లో గల సమర్థ పాఠశాల మైదానంలో మంగళవారం జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు మాత్రమే చేసింది. జట్టులో కేతన్‌కుమార్ 106 బంతుల్లో 16 ఫోర్లతో సెంచరీ (101) సాధించాడు. సంజయ్ 45 పరుగులు చేశాడు. 49 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో పాలమూరు గెలిచింది. జట్టులో శశంక్ 2, షాదాబ్‌అహ్మద్ 2, డేవిడ్ క్రిపాల్ 1 వికెట్ తీశారు. బోనస్‌తో ఒకటితో కలిపి మహబూబ్‌నగర్ 6 పాయింట్లు సాధించింది.
క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తోందని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని సమర్థ పాఠశాల మైదానంలో జరుగుతున్న అండర్-23 ఇంట్రా డిస్ర్టిక్ట్ లీగ్ రెండో రోజు పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటి జాతీయ జట్టుకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో క్రికెట్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఉపాధ్యక్షుడు సురేశ్‌కుమార్, కోచ్ గోపాలకృష్ణ, సీనియర్ క్రీడాకారుడు ఆబిద్‌హుసేన్ పాల్గొన్నారు.
Updated Date - May 20 , 2025 | 11:01 PM