ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

దేశం నుంచి పాక్‌, బంగ్లాదేశీయులను పంపాలి

ABN, Publish Date - May 08 , 2025 | 11:14 PM

దేశంలో ఉన్న పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ దేశస్తులను ఏరివేయాలని రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు గురువారం కలెక్టరేట్‌ ఆవరణలో బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

కలెక్టరేట్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు

కలెక్టరేట్‌ వద్ద బీజేపీ నాయకులు నిరసన

గద్వాల న్యూటౌన్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): భారతదేశంలో ఉన్న పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ దేశస్తులను ఏరివేయాలని రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు గురువారం కలెక్టరేట్‌ ఆవరణలో బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ దేశాలకు చెందిన వ్యక్తులు అక్రమంగా భారతదేశంలో నివాసం ఉంటూ ఉగ్రవాద కార్యక్రమాలకు తెరలేపుతున్నారన్నారు. పౌరసత్వం లేకున్నా నకిలీ ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డులు, ఓటర్‌కార్డులను సృ ష్టించి నివాసం ఉంటున్నారని, ఇలాంటి వారిని పోలీస్‌శాఖ గుర్తించి వెంటనే వారిని వెనక్కి పంపాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఏవో సరితారాణికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్‌ మెంబర్లు బండల వెంకట్రాములు, రమాసాయిబాబ, జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్‌ ఎగ్బోటే, గతంలో అసెంబ్లీ పోటీచేసిన అభ్యర్థి శివారెడ్డి, పట్టణ అధ్యక్షురాలు జయశ్రీ, జిల్లా కార్యదర్శి స్వప్న, ఐటీ సెల్‌ కన్వీనర్‌ చిత్తారి కిరణ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - May 08 , 2025 | 11:14 PM