ఓపెన్‌గానే.. పది, ఇంటర్ ఓపెన్ పరీక్షల్లో వసూళ్ల పర్వం
ABN, Publish Date - Apr 24 , 2025 | 11:55 PM
ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వ హించే పది, ఇంటర్ పరీక్షలు అంతా ఓపెన్‌గానే సాగుతున్నా యి.
- ఉమ్మడి జిల్లాలోని పరీక్షా కేంద్రాల్లో వసూల్ రాజాలు - ప్రతీ అభ్యర్థి నుంచి రూ.300 వసూలు
- నేరుగా చిట్టీలు అందిస్తున్న ఇన్విజిలేటర్లు! - సహకరిస్తున్న సీఎస్, డీవోలు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వ హించే పది, ఇంటర్ పరీక్షలు అంతా ఓపెన్‌గానే సాగుతున్నా యి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు సాగుతోందన్న ఆ రోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 20 నుంచి మొదలైన ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణ కోసం కొందరు ఉపాధ్యా యులు సీఎస్, డీవోలు, ఇన్విజిలేటర్లుగా నియమించాలని అధికారులపై మరి ఒత్తిడి పెట్టించి, విధుల్లో చేరి నాలుగు డబ్బులు వెనుకేసుకుంటు న్నారు. ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు రాసే అభ్య ర్థుల నుంచి ప్రతీ పరీక్షకు రోజుకు రూ.300 చొ ప్పున అక్కడి ఇన్వి జిలేటర్ వసూలు చేసి పరీక్ష ముగిసిన త ర్వాత పంచుకుం టున్నారు. ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా రోజుకు రూ.లక్షకుపైగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ దందా జరుగుతున్నా ఉన్నతాధికారులు తమకేమి తెలియనట్లు వ్యవహరిస్తున్నారు.
డబ్బులు ఇస్తేనే చిట్టీలు అందిస్తున్న ఇన్విజిలేటర్..
వివిధ శాఖల్లో అటెండర్, జూనియర్ అసిస్టెంట్, తదితర విభాగాలలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు, మధ్యలో చదువు మానివేసిన నిరుద్యోగు లు ఓపెన్ స్కూల్ చదువుకునే అవకాశం ఉంటుంది. అయితే, అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్‌కు అడ్మిషన్, పరీక్ష ఫీజులు చెల్లించి రాస్తున్నా రు. అభ్యర్థులు పూర్తిస్థాయిలో చదువుకునే అవకాశం లేకపోవడంతో పరీక్ష లు రాసేందుకు కొంత ఇబ్బంది పడుతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న ఓపెన్ స్కూల్ నిర్వాహకులు అభ్యర్థుల నుంచి డబ్బులు రాబట్టుకుంటున్నా రు. చూచిరాత పరీక్ష రాసేందుకు అన్ని విఽధాల అవకాశం కల్పిస్తాం... సీఎస్, డీవోలను, అక్కడి ఇన్విజిలేటర్లను చూసుకుంటే చాలు... రోజు పరీక్షలకు మూడు నుంచి ఐదు వందల రూపాయలు ఇస్తే వారి నుంచే పరీక్ష హాల్‌లో నేరుగా ప్రశ్నకు సంబంధించిన జవాబు చిట్టీ ఇస్తారు.. టకటకా రాసుకుంటే చాలు మీరు పాస్ కావచ్చు అని భరోసా ఇస్తున్నారు. దీంతో అభ్యర్థులు అం దుకు అంగీకరించి రోజూ పరీక్షకు ముందే హాల్ ఇన్‌చార్జికి ఒక్కో అభ్యర్థి చెప్పిన ప్రకారం డబ్బులు ఇస్తున్నారు. దీంతో ఓపెన్ పది, ఇంటర్మీడియట్ పరీక్షలు జోరుగా కాపీయింగ్ నడుస్తున్నది. నేరుగా పరీక్ష కేంద్రంలోకి సబ్జెక్టులకు సంబంధించిన టెస్ట్ పేపర్స్, గైడ్ తీసుకుపోయి పరీక్షలు రాసు ్తన్నారు. అక్కడి సీఎస్, డీవోలు పరీక్ష కేంద్రంలో గేట్‌లకు తాళం వేసి గట్టి పోలీసు బందోబస్తు మధ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. లోపల మాత్రం గుట్టుచప్పుడు కాకుండా కాపీయింగ్ సాగుతున్నది. విద్యాశాఖ అధి కారులు మాత్రం అటువైపు చూడటం లేదు. ఒకవేళ పరీక్ష కేంద్రాలను పరిశీలించినా.. వచ్చామా.. వెళ్లామా.. అన్న విధంగా సాగుతోంది వీరి వ్యవ హారం.
డబ్బులు తీసుకుంటున్నారు - ఓ అభ్యర్థి
పరీక్షలు కాపీయింగ్ రాయించేందుకు ప్రతీ అభ్యర్థి నుంచి రూ.300 నుంచి రూ.500 తీసుకుంటున్నారు. పరీక్షకు డబ్బులు ఇస్తేనే హాల్‌లో చిట్టీ లు రాయనిస్తున్నారు. లేకుంటే వచ్చింది రాయమంటున్నారు. అసలు పక్క కు కూడా తిరగనివ్వడం లేదు. పరీక్షకు ముందే సెంటర్‌లోకి వచ్చిన వెంట నే డబ్బులు తెచ్చారా?.. అని అడిగి డబ్బులు తీసుకుంటున్నారు.
డబ్బులు తీసుకుంటున్నట్లు నా దృష్టికి వచ్చింది
ఓపెన్ స్కూల్ పది, ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న అభ్యర్థుల నుంచి అక్కడి ఇన్విజిలేటర్ డబ్బులు వసూలు చేస్తున్నారని తన దృష్టికి వచ్చింది. దీనిపై ఎక్కడ జరుగుతుందో వివరాలు తీసుకొని చర్యలు తీసుకుంటాం.
- ఎ.ప్రవీణ్‌కుమార్, డీఈవో, మహబూబ్‌నగర్
Updated Date - Apr 24 , 2025 | 11:55 PM