వన్‌డే లీగ్ చాంపియన్ మహబూబ్‌నగర్
ABN, Publish Date - Jun 06 , 2025 | 11:16 PM
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-19 ఉమ్మడి జిల్లా వన్‌డే లీగ్ టోర్నీలో మహబూబ్‌నగర్ జట్టు చాంపియన్‌గా నిలిచింది.
- 71 పరుగుల తేడాతో జడ్చర్లపై ఘన విజయం
- అర్ధసెంచరీతో రాణించిన కాన్షిక్
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-19 ఉమ్మడి జిల్లా వన్‌డే లీగ్ టోర్నీలో మహబూబ్‌నగర్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. పాలమూరు పట్టణ సమీపంలోని సమర్థ పాఠశాల మైదానంలో శుక్రవారం నిర్వహించిన మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు జడ్చర్లపై 71 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. జట్టులో కాన్షిక్ 84 బంతుల్లో 6 ఫోర్లతో అర్ధసెంచరీ (51) సాధించాడు. యువన్ ముద్దనూరి 60 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్‌తో 43 పరుగులు, మహ్మద్ సోనూ 38, మనోజ్‌యాదవ్ 39 పరుగులు చేశారు. మణిచరణ్, శ్రీసాయి, పవన్, అక్షయ్‌సాయి ఒక్కో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జడ్చర్ల జట్టు 41.5 ఓవర్లలో 169 పరుగులకు కూప్పకూలింది. జట్టులో బి. సంజయ్ 91 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో అర్ధసెంచరీ (73) చేశాడు. కేతన్‌కుమార్‌యాదవ్ 35 పరుగులు చేశాడు. మహబూబ్‌నగర్ బౌలర్లలో అకింత్‌రాయ్ 3, కాన్షిక్ 2 అబినావ్ 2, యువన్ 1 వికెట్ తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. లీగ్ టోర్నీల్లో 15 పాయింట్లు సాధించి మహబూబ్‌నగర్ విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా విజేత జట్టును జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అభినందించారు. టోర్నీలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో మ్యాచ్‌లు నిర్వహించి ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎండీసీఏ ఉపాధ్యక్షుడు సురేశ్‌కుమార్, కోచ్‌లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, కోచ్ అబ్దుల్లా, సీనియర్ క్రీడాకారుడు మన్నాన్, ఎన్‌ఆర్‌ఐ కే శ్రీనివాసులు పాల్గొన్నారు.
Updated Date - Jun 06 , 2025 | 11:16 PM