క్రీడా స్పూర్తికి ప్రతీక ఒలింపిక్ రన్
ABN, Publish Date - Jun 20 , 2025 | 11:45 PM
ఒలింపిక్ రన్ క్రీడా స్పూర్తికి ప్రతీక అని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
- మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి) : ఒలింపిక్ రన్ క్రీడా స్పూర్తికి ప్రతీక అని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పాలమూరు పట్టణంలో శుక్రవారం నిర్వహించిన ఒలింపిక్ టార్చ్ రన్‌ను జిల్లా కేంద్రంలోని ప్రధాన స్టేడియంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్న శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. అక్కడి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్‌పి వెంకటేశ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మిఽథున్‌రెడ్డి, డీవైఎస్‌వో శ్రీనివాస్, ఒలింపిక్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోని క్రీడాభివృద్దికి కృషి చేయనున్నామన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా చర్యలు తీసుకోవాలని వ్యాయామ ఉపాధ్యాయులకు సూచించారు. రాష్ట్ర క్రీడాకారులు 2036 నాటికి ఒలింపిక్ స్థాయికి ఎదిగేలా చేయాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో క్రీడా సంఘాల ప్రతినిధులు మనోహర్‌రెడ్డి, శరత్‌చంద్ర, చెన్నవీరయ్య, విలియం, సురేశ్, రాంచందర్, జగన్‌మోహన్‌గౌడ్, శారదాబాయి, వేణుగోపాల్, జియావుద్దీన్, ఉమామహేశ్వర్‌రెడ్డి, భానుకిరణ్, ఆనంద్, రఘు, సునీల్ పాల్గొన్నారు.
అంతర్జాతీయస్థాయికి ఎదగాలి-
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి) : జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లా క్రీడాకారుడు కిరణ్‌కుమార్ థాయ్‌లాండ్‌లో ఈ నెల 2 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించిన పురుషుల అండర్-23 సాఫ్ట్‌బాల్ ఆసియా కప్ పోటీల్లో పాల్గొన్న భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సందర్భంగా స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయనను ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి, క్రీడా సంఘాల ప్రతినిధులు అభినందించారు.
Updated Date - Jun 20 , 2025 | 11:45 PM