కుంటలు, నాళాల్లో నిర్మాణాలపై అధికారుల తనిఖీ
ABN, Publish Date - May 17 , 2025 | 11:12 PM
పట్టణంలో కుంటలు, నాళాలు ఆక్రమించి నిర్మించుకున్న భవన నిర్మాణాలను శనివారం ఇరిగేషన్ డీఈ ఆనంద్ కిశోర్, ఏఈ నిర్మల, మునిసిపల్ టీపీవో లక్ష్మీపతి తనిఖీ చేశారు.
- నిర్మించుకున్న భవనాలను కూల్చలేమన్న టీపీవో
- రెవెన్యూ, ఇరిగేషన్, మునిసిపల్ కమిటీతో కుంటలను మూయాల్సిందేనని సూచన
- ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
కోస్గి, మే 17 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో కుంటలు, నాళాలు ఆక్రమించి నిర్మించుకున్న భవన నిర్మాణాలను శనివారం ఇరిగేషన్ డీఈ ఆనంద్ కిశోర్, ఏఈ నిర్మల, మునిసిపల్ టీపీవో లక్ష్మీపతి తనిఖీ చేశారు. ‘నోటీసులిచ్చారు.. చర్యలు మరిచారు’ శీర్షికన ఈనెల 15న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వార్తా కథనానికి అధికారులు స్పందించారు. పట్టణంలోని ఎర్రకుంట, లద్దమడుగు, పాతపురికుంటలను అధికారులు పరిశీలించారు. కుంట, కాలువను ఆక్రమించి కట్టిన భవనాలు మేము కూల్చలేమని టీపీవో తెలిపారు. స్పందించిన ఇరిగేషన్ ఏఈ వర్షాకాలంలో కాలనీల్లో నీరు చేరుతుందని, ఇబ్బందులు తప్పవన్నారు. అప్పటికప్పుడు తాత్కాలిక పరిష్కారం చూద్దామని టీపీవో సమాధానమిచ్చారు. మునిసిపల్ టాస్క్‌ఫోర్స్ బృందం సభ్యులు తీర్మానం చేసి కాలువలను మూసివేయవచ్చన్నారు. స్పందించిన ఇరిగేషన్ అధికారులు తాము ఒప్పుకోమని.. కాలువలు యదావిధిగా ఉండాల్సిందేనని సూచించారు. ఈ విషయంపై ఉన్నతాధికా రులకు నివేదిక పంపుతామన్నారు. ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
Updated Date - May 17 , 2025 | 11:12 PM