ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎవరికీ మినహాయింపు లేదు

ABN, Publish Date - May 14 , 2025 | 11:10 PM

విడతల వారీగా ఇస్తున్న శిక్షణకు ఉపాధ్యాయులంతా హాజరు కావాల్సిందేనని, ఎవరికీ మినహాయింపు లేదని మహబూబ్‌నగర్‌ డీఈవో ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించేందుకు జూన్‌లో బడిబా ట కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పిన ఆయన.. పాఠశాలలు ప్రారంభించిన రోజే పుస్తకాలు, యూనిఫామ్స్‌ అందిస్తామని తెలిపారు.

ఆంధ్రజ్యోతితో మాట్లాడుతున్న డీఈవో ప్రవీణ్‌ కుమార్‌

ఉపాధ్యాయులంతా వేసవి శిక్షణకు హాజరు కావాల్సిందే

పాఠశాలల ప్రారంభం నాటికి విద్యార్థులకు యూనిఫామ్స్‌, పుస్తకాలు అందిస్తాం

డీఈవో ప్రవీణ్‌కుమార్‌

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, మే 14 (ఆంధ్రజ్యోతి): విడతల వారీగా ఇస్తున్న శిక్షణకు ఉపాధ్యాయులంతా హాజరు కావాల్సిందేనని, ఎవరికీ మినహాయింపు లేదని మహబూబ్‌నగర్‌ డీఈవో ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించేందుకు జూన్‌లో బడిబా ట కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పిన ఆయన.. పాఠశాలలు ప్రారంభించిన రోజే పుస్తకాలు, యూనిఫామ్స్‌ అందిస్తామని తెలిపారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మంగళవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఆ వివరాలు..

ఉపాధ్యాయులకు ఎన్ని రోజు లు శిక్షణ ఇస్తారు?

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఈ శిక్షణ కొనసాగుతుంది. స్కూల్‌ అసిస్టెంట్స్‌కు మూడు విడతల్లో శిక్షణ ఉం టుంది. ఈ నెలాఖరు వరకు నిర్వహిస్తారు. మొడటి విడత శిక్షణ మంగళవారం జేపీఎన్‌ఈఎ్‌స(మైనార్టీ గురుకుల పాఠశాలలో) ప్రా రంభమైంది. స్కూల్‌ అసిస్టెంట్‌ గణితం, ఆంగ్లం, సాంఘిక శాస్త్రం తోపాటు మండల స్థాయిలో శిక్షణ ఇచ్చే ఎస్‌జీటీలకు కూడా ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నాం. మండల స్థాయిలో 20 నుంచి ఎస్‌జీటీలకు శిక్షణ ఉంటుంది.

శిక్షణకు కొందరు టీచర్లు డు మ్మా కొట్టాలన్న ఆలోచనలో ఉ న్నట్లు ఆరోపణలున్నాయి. దా నిపై ఏమంటారు?

టీచర్లు అందరూ శిక్షణకు హాజరు కావాల్సిందే. ఎవరికీ మినహాయింపు లేదు. ఐదు రోజల శిక్షణలో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండాల్సిందే.

ఈ శిక్షణ జాతీయ విద్యావిధానంలో భాగమేనా?

ఉపాధ్యాయులకు ఇచ్చే శిక్షణ విద్యార్థులు కచ్చింతంగా చదవడం, రాయడంతో పాటు బోధన అభ్యసన సామర్థ్యాలు సాధించడం ఎంతో అవసరం. జాతీయ విద్యా విఽధానం అమలులో ఇది కూడా ఓ భాగమే.

బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించేందుకు ఎలాంటి ప్రణాళిక చేపట్టారు?

బడి ఈడు, బడి బయటి పిల్లలను బడిలో చేర్పించేందుకు జూన్‌ 2 నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహిస్తాం. విద్యార్థుల సంఖ్య పెం చేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం.

పాఠ్యపుస్తకాలు యూనిఫామ్‌ ఎప్పటిలోపు అందిస్తారు?

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠశాల పునఃప్రారంభం రో జు నుంచే పాఠ్య పుస్తాకాలు, నోట్‌ బుక్స్‌, యూనిఫామ్స్‌ అందిస్తాం. అం దుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాం.

జిల్లాలో ఈ ఏడాది ప్రైవేట్‌ పాఠశాలు వెలిశాయి. వాటికి అనుమతులు ఇచ్చారా?

గత అక్టోబరులోపు ప్రైవేట్‌ పాఠశాలల అనుమతుల కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న వాటికి సంబంధించి అన్ని సజావుగా ఉన్న ఫైల్స్‌ను ఆర్‌జేడీ కార్యాలయానికి పం పించాం. మా పరిధిలో ఉన్న వాటికి నిబంధనల ప్రకారం అనుమతిచ్చాం. 40 పాఠశాలలకు పైగా దరఖాస్తులు రాగా, కేవలం 13 పాఠశాలలకు అనుమతి వచ్చింది. మిగతా వాటికి రాలేదు. అనుమతి లేని పాఠశాలల్లో పిల్లలను చేర్చి, తల్లిదండ్రులు ఇబ్బం ది పడొద్దు.

Updated Date - May 14 , 2025 | 11:10 PM