పండ్ల వ్యాపారులపై కక్షసాధింపు వద్దు
ABN, Publish Date - Jun 15 , 2025 | 11:19 PM
ఏళ్ల తరబడి, తరాలుగా బస్టాండ్ అడ్డాగా పండ్ల వ్యాపారం నమ్ముకుని జీవనం సాగిస్తున్న నిరు పేదలపై కక్ష సాధింపు చర్యలు సరికాదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
- 15 దుకాణాలతోనే ఆర్టీసీ బాగుపడిపోదు
- అవసరమైతే వాళ్లకే తక్కువ ధరకు షెట్టర్లు ఇవ్వండి
- మాజీ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి) : ఏళ్ల తరబడి, తరాలుగా బస్టాండ్ అడ్డాగా పండ్ల వ్యాపారం నమ్ముకుని జీవనం సాగిస్తున్న నిరు పేదలపై కక్ష సాధింపు చర్యలు సరికాదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అవసర మైతే వారికి సాయం చేయాలే తప్పా ఉన్న పళంగా ఖాళీ చేసి వెళ్లిపో వాలంటే ఎన్నో కుటుంబాలు వీధిన పడతాయన్నారు. ఆర్టీసీ బస్టాండ్ ముందు నూతనంగా ఏర్పాటు చేసిన షెటర్లను అద్దెకు ఇచ్చిన నేపథ్యంలో వాటి ముందున్న పండ్ల దుకాణాలను ఖాళీ చేయాలని శనివారం ఆర్టీసీ, మునిసిపల్ శాఖ ప్రయత్నించడంతో పండ్ల వ్యాపారులు అడ్డుకో వడంతో ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసింది. కాగా ఆదివారం ఘటనస్థలిని సందర్శించిన మాజీ మంత్రి పండ్ల వ్యాపారులతో మాట్లాడారు. ఆర్టీసీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడా రు. ఆర్టీసీ బస్టాండ్ ముందు పండ్ల వ్యాపారులు ఎన్నో ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారని, పక్కనే ఆ టో స్టాండ్‌లో అటో డ్రైవర్లు అటోలను పెట్టుకుని ఉపాధి పొందుతున్నారని, వారిని ఖాళీ చేయిస్తే వారి బతుకుదెరువు ఏం కావాలని ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పట్టణంలో పలు చోట్ల వీధి వ్యాపారులకు దుకాణాలు ఏర్పాటు చేసి ఇచ్చామని, పండ్ల వ్యాపారులకు మంచి షెటర్లు వేసి ఇవ్వాలని రూ.2.50 కోట్లతో ప్రతిపాదనలు చేశామని, టెండర్లు పిలిచే సమయంలో ఎన్నికలు వచ్చాయన్నారు. ఆర్టీసీ నిర్మించిన 15 దుకాణాల అద్దెతోనే ఆర్టీసీ బాగుపడిపోదని, వాళ్లు పెట్టిన అద్దెలు పేదలు చెల్లించలేరని, అవస రమైతే వారికే తక్కువ ధరకు దుకాణాలను అలాట్ చేసి మిగతా డబ్బు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించుకోవాలని సూచించారు. ఇది ఎవరి జాగీరు కాదని, ప్రభుత్వ స్థలంలోనే పండ్ల దుకా ణాలు ఉన్నాయని, ఎలా ఖాళీ చేయిస్తారో చూస్తామన్నారు. బలవంతంగా ఖాళీ చేయిస్తే తాము మళ్లీ వారికి ఇక్కడే మంచి దుకాణాలు నిర్మించి ఇస్తామని భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్ నాయకులు కోరమోని నర్సింహులు, గంజి ఎంకన్న, శివరాజు, రామ్‌లక్ష్మణ్ పాల్గొన్నారు.
Updated Date - Jun 15 , 2025 | 11:19 PM